Share News

Ratan Tata: రతన్ టాటా నోబల్ సన్ ఆఫ్ ఇండియా.. దాతృత్వానికి ప్రతిరూపం

ABN , Publish Date - Oct 10 , 2024 | 01:17 PM

సీనియర్ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా మృతికి భారత్‌తోపాటు అనేక మంది అమెరికా అగ్రనేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా కీలక ప్రకటనలు చేశారు.

Ratan Tata: రతన్ టాటా నోబల్ సన్ ఆఫ్ ఇండియా.. దాతృత్వానికి ప్రతిరూపం
Ratan Tata

దేశంలో అతిపెద్ద పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) బుధవారం రాత్రి మరణించారు. రతన్ టాటా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వాన్ని మార్గనిర్దేశం, అభివృద్ధి చేయడంలో ఆయన కృషి మరువలేనిదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.


కార్నెల్ యూనివర్సిటీ

రతన్ టాటా అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. అక్కడ ఆయన సేవలను విశ్వవిద్యాలయం గుర్తుచేసుకుంది. రతన్ టాటా అంతర్జాతీయంగా ఈ యూనివర్సిటీకి అతిపెద్ద దాతగా నిలిచారని అమెరికా కార్నెల్ యూనివర్సిటీ తెలిపింది. కార్నెల్ తాత్కాలిక ప్రెసిడెంట్ మైఖేల్ I కోట్లికాఫ్ మాట్లాడుతూ టాటా విద్య పరిశోధనలకు ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా 2013లో యూనివర్సిటీ 'ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు. 2006 నుంచి 2022 వరకు మూడు సార్లు కార్నెల్ ట్రస్టీగా పనిచేశారు. US-India వ్యాపార, పరిశ్రమల సంఘం సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.


నోబల్ సన్‌ఆఫ్ ఇండియా

ఈ క్రమంలోనే యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ప్రెసిడెంట్ అతుల్ కేశప్ రతన్ టాటా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పద్మవిభూషణ్ గ్రహీత రతన్ టాటా " నోబల్ సన్‌ఆఫ్ ఇండియా, దాతృత్వానికి రోల్ మోడల్" అని పేర్కొన్నారు. రతన్ టాటా తన కంపెనీలను భారతదేశ శ్రేయస్సు, అభివృద్ధికి నడిపించినప్పటానికే నిర్వహిస్తున్నానరని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాణిజ్యం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తెలిసేలా చేశారని అన్నారు. ఆయన సహచరులు, వ్యాపార భాగస్వాములకు మాత్రమే కాకుండా రతన్ టాటా మంచి విలువలను పాటించారని గుర్తు చేసుకున్నారు.


రతన్ టాటా

రతన్ టాటా భౌతికకాయాన్ని గురువారం ఉదయం ఆయన ఇంటి నుంచి దక్షిణ ముంబైలోని 'నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' (NCPA)కి తీసుకెళ్లారు. అక్కడ ప్రజలు చివరి నివాళులు అర్పిస్తారు. ఆయన మృతదేహాన్ని తెల్లటి పూలతో అలంకరించిన వాహనంలో ఎన్‌సీపీఏకు తరలించారు. వాహనం టాటా ఇంటి నుంచి బయలుదేరే ముందు, NCPA నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ముంబై పోలీసు బ్యాండ్ ఆయన గౌరవార్థంగా తీసుకెళ్తారు. ఈరోజు సాయంత్రం ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి:


Ratan Tata: టాటా గ్రూపు ఓనరైన రతన్ టాటా ఆస్తులు ఎంత.. కంపెనీ ప్రాపర్టీ ఎంత..


Ratan Tata: ఈ ఒక్క కారణంతో.. రతన్ టాటా విదేశాల నుంచి భారత్ వచ్చేశారు..


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి



Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 10 , 2024 | 01:18 PM