Share News

Stock Market: బడ్జెట్ వేళ భారీగా పడిపోయిన సూచీలు.. భారీగా నష్టపోయిన స్టాక్స్ అవే..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:46 PM

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. మదుపర్ల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ లేదనే కారణంతో అమ్మకాలు మొదలయ్యాయి.

Stock Market: బడ్జెట్ వేళ భారీగా పడిపోయిన సూచీలు.. భారీగా నష్టపోయిన స్టాక్స్ అవే..!
Stock Market

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్‌లో బడ్జెట్ (Budget 2024) ప్రవేశపెడుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. మదుపర్ల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ లేదనే కారణంతో అమ్మకాలు మొదలయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా నష్టపోయింది. 80 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం (12:30 గంటలు) 556 పాయింట్లు కోల్పోయి 79,920 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది (Stock Market).


మంగళవారం ఉదయం దాదాపు 50 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత భారీ నష్టాలను చవిచూసింది. 500 పాయింట్లకు పైగా కోల్పోయింది. 24,500 మార్క్ దిగువకు చేరుకుంది. ప్రస్తుతం (12:30 గంటలు) 222 పాయింట్ల నష్టంతో 24,287 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 476 పాయింట్లు కోల్పోయింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా భారీగా పతనమయ్యాయి.


ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన రైల్వే స్టాక్స్ చాలా వరకు 10 శాతానికి పైగా పడిపోయాయి. ప్రస్తుతం టైటాన్ కంపెనీ, ఐటీసీ, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ కన్ష్యూమర్ కంపెనీలు లాభాల్లో సాగుతున్నాయి. వేదాంత, నాల్కో, చంబల్ ఫెర్టిలైజర్స్, వోడాఫోన్ ఐడియా భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

Updated Date - Jul 23 , 2024 | 12:46 PM