Hyderabad: విద్యుత్ కనెక్షన్ కట్ చేశారని ఉద్యోగిపై వినియోగదారుడి దాడి
ABN , Publish Date - Dec 28 , 2024 | 08:24 AM
బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేసిన ఉద్యోగిపై ఓ వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్(KPHB Police Station) పరిధిలో శుక్రవారం జరిగింది. బాధితుడు శ్యామ్, పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డునెంబర్ 2లోని ఈడబ్ల్యూఎస్ 109లో ఓ వినియోగదారుడు విద్యుత్ బిల్లు చెల్లించలేదు.
హైదరాబాద్: బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేసిన ఉద్యోగిపై ఓ వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్(KPHB Police Station) పరిధిలో శుక్రవారం జరిగింది. బాధితుడు శ్యామ్, పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డునెంబర్ 2లోని ఈడబ్ల్యూఎస్ 109లో ఓ వినియోగదారుడు విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో విద్యుత్ ఉద్యోగి శ్యామ్ ఆ ఇంటి కనెక్షన్‌ను తొలగించేందుకు వెళ్లారు. నివాసంలోఉన్న హుస్సేన్ రంజాన్(Hussein Ramadan)కు సమాచారం ఇచ్చి కరెంట్ సరఫరా నిలిపేందుకు ప్రయత్నించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చెత్తకుప్పలో రోజుల పసికందు..
దీంతో వారు బయటకు వచ్చి దురుసుగా ప్రవర్తించి శ్యామ్‌పై చేయి చేసుకుని అతని వాహనాన్ని సైతం కిందపడేశారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం కేపీహెచ్‌బీ(KPHB)లోని విద్యుత్ కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు మోహన్ ఆధ్వర్యంలో దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News