Share News

Hyderabad: విమానాల్లో నగల చోరీలు.. వృద్ధ, మధ్య వయస్కులైన మహిళలే టార్గెట్‌

ABN , Publish Date - Jun 16 , 2024 | 10:11 AM

దర్జాగా విమానాల్లో తిరుగుతాడు.. దృష్టంతా లగేజీల్లో నగలను తీసుకెళ్లే మధ్య వయస్కులు, వృద్ధులైన మహిళల పైనా..! మాటల్లో పెడతాడు.. ఫ్లైట్‌లో లగేజీ సర్దడంలో సహకరిస్తాడు.. అదను చూసి, నగలను తస్కరిస్తాడు.

Hyderabad: విమానాల్లో నగల చోరీలు.. వృద్ధ, మధ్య వయస్కులైన మహిళలే టార్గెట్‌

- 110 రోజుల్లో 200 విమాన ప్రయాణాలు

- ఘరానా నిందితుడి అరెస్టు.. కిలో బంగారం సీజ్‌

హైదరాబాద్: దర్జాగా విమానాల్లో తిరుగుతాడు.. దృష్టంతా లగేజీల్లో నగలను తీసుకెళ్లే మధ్య వయస్కులు, వృద్ధులైన మహిళల పైనా..! మాటల్లో పెడతాడు.. ఫ్లైట్‌లో లగేజీ సర్దడంలో సహకరిస్తాడు.. అదను చూసి, నగలను తస్కరిస్తాడు. ఇలా 110 రోజుల్లో 200 విమాన ప్రయాణాలు చేసి, చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ఆటను శంషాబాద్‌(Shamshabad) ఆర్జీఐఏ పోలీసులు కట్టించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి(DCP Narayana Reddy) వివరాలను వెల్లడించారు. న్యూఢిల్లీలోని పహాడ్‌గంజ్‌కు చెందిన రాజేశ్‌కపూర్‌ మధ్య వయస్కులు, వయసు పైబడ్డ మహిళలను టార్గెట్‌గా చేసుకుంటూ విమానాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. అంతర్జాతీయ విమానాశ్రయాలతో కనెక్టివిటీ విమానాలున్న నగరాల మధ్య 110 రోజుల్లో 200 ప్రయాణాలు చేసిన రాజేశ్‌.. ఆయా విమానాశ్రయాల్లో టార్గెట్లను ఎంచుకునేవాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: 20 నిమిషాల ప్రయాణానికి.. 1:10 గంటల సమయం..


వారిని మాటల్లోకి దింపి.. విమానంలోకి వెళ్లాక.. లగేజీని సర్దడం వంటి పనుల్లో సహాయం చేస్తున్నట్లు నటించేవాడు. బాధితులు వాష్‌రూం వెళ్లినప్పుడో.. ఆదమరిచి ఉన్నప్పుడో.. ఆ లగేజీల్లో ఉన్న ఆభరణాలను తస్కరించేవాడు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాల్లో వచ్చి, ఇతర నగరాలకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకునేవాడని డీసీపీ వివరించారు. ఈ తరహా చోరీలపై శంషాబాద్‌లో ఐదు, వనస్థలిపురం(Vanasthalipuram)లో ఒకటి, ఢిల్లీలో 20 దాకా కేసులున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన దినేశ్‌గుప్తా అనే వ్యక్తి రాజేశ్‌కు ఫేక్‌ ఐడీల ద్వారా, విమాన టిక్కెట్లు ఇప్పించేవాడని పేర్కొన్నారు. చోరీ చేసిన నగలను రాజేశ్‌ ఢిల్లీలోని పాన్‌బ్రోకర్లు, లేదా దినేశ్‌కు విక్రయుంచేవాడని గుర్తించామన్నారు. రాజేశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని, అతని వద్ద కిలో బంగారు ఆభరణాలను సీజ్‌ చేశామని వెల్లడించారు. దినేశ్‌, ఇతర పాన్‌బ్రోకర్ల అరెస్టుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 10:11 AM