Hyderabad: బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఖాళీ.. స్కైప్ కాల్‌తో రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల వల
ABN , Publish Date - May 03 , 2024 | 11:45 AM
మీ ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల నుంచి ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
- ఉగ్ర సంస్థలకు నిధులిచ్చారంటూ బెదిరింపులు
హైదరాబాద్ సిటీ: మీ ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల నుంచి ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, తైవాన్‌కు బుక్ చేసిన పార్సిల్లో మీ ఆధార్ వివరాలు ఉన్నాయని చెప్పాడు. వెంటనే స్కైప్ వీడియో కాల్లో పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ చేశాడు. ముంబై క్రైం బ్రాంచ్ అధికారిగా అతను పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాల్లో ఉన్న ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని, దానికి సంబంధించి కోల్‌కతా, గోవా, బెంగళూరు, ముంబైలలో కేసులు నమోదయ్యాయని చెప్పాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఆహా.. ఏం ఐడియా గురూ.. ఉల్లిపాయల బస్తాల మాటున నిషేధిత విత్తనాల రవాణా
ఓ వ్యక్తి ఫొటో చూపుతూ ఉగ్రమూకలకు నిధులు సరఫరా చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశామని, అతడిచ్చిన సమాచారంతోనే మీకుఫోన్ చేస్తున్నామని చెప్పాడు. ఉగ్రసంస్థల స్లీపర్ సెల్స్ మీకు, మీ కుటుంబానికి హాని చేయవచ్చని, అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాట్లాడుతూనే ఉండాలని చెప్పాడు. మీ ఖాతాలో ఉన్న డబ్బును ఆర్బీఐ(RBI) ఖాతాలోకి మార్చాలని, ఆర్బీఐ అధికారులు తనిఖీ చేసి, తిరిగి మీ ఖాతాలో జమచేస్తారని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి తన ఖాతాలో ఉన్న రూ.20.20 లక్షలను అతడు సూచించిన ఖాతాకు పంపాడు. వారం రోజులు దాటినా డబ్బు రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News