Viral Video: ఆరో అంతస్తులో అగ్ని ప్రమాదం..18వ అంతస్తుకు వ్యాపించిన మంటలు!
ABN , Publish Date - Jan 13 , 2024 | 04:55 PM
ముంబయిలోని డోంబివిలీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆరో అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర రాజధాని ముంబయి(Mumbai) సమీపంలోని థానేలో ఘోర అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. డోంబివిలీలో లోధా ఫేజ్ 2లోని ఖోనీ ఆస్ట్రెల్లా టవర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ టవర్‌లోని 5, 6వ అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ క్రమంలోనే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి 18వ ఫ్లోర్ వరకు చేరినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!
ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న వారందరినీ రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏడో అంతస్తు(7th floor)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆరో అంతస్తులో మంటలు చేలరేగాయని అధికారులు అంటున్నారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనంలోని 18వ అంతస్తుకు మంటలు వ్యాపించాయన్నారు. మొదటి మూడు అంతస్తుల్లో మాత్రమే ప్రజలు నివాసం ఉంటున్నారని అగ్నిమాపక దళ అధికారులు చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్యూట్ కారణామా ఇంకా ఏదైనా అంశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.