Share News

Dussehra 2024: ఇంతకీ దసరా ఎప్పుడు.. అక్టోబర్ 12 లేదా 13 ? పండగ ఏ రోజు జరుపుకోవాలి..?

ABN , Publish Date - Oct 04 , 2024 | 05:33 PM

అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు వస్తుంది. ఆ మరునాడు అంటే.. అక్టోబర్ 13వ తేదీ ఉదయం వరకు ఈ దశమి ఘడియలు ఉన్నాయి. అంటే.. ఆదివారం ఉదయం 9.08 నిమిషాల వరకు ఉంది. ఈ నేపథ్యంలో దశమి ఘడియలు శనివారం ఉదయం ప్రారంభమవుతాయి.

Dussehra 2024: ఇంతకీ దసరా ఎప్పుడు.. అక్టోబర్ 12 లేదా 13 ? పండగ ఏ రోజు జరుపుకోవాలి..?

దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో దసరా ఒకటి. అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి. అయితే ఇంతకీ దసరా పండగ ఎప్పుడు అదే సందిగ్దం అయితే దుర్గమ్మ భక్తుల్లో నెలకొంది. ఎందుకంటే.. ఈ ఏడాది దసరా పండగ.. విజయ దశమి మిగులు తగులుగా వచ్చింది. అంటే అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు వస్తుంది.

ఆ మరునాడు అంటే.. అక్టోబర్ 13వ తేదీ ఉదయం వరకు ఈ దశమి ఘడియలు ఉన్నాయి. అంటే.. ఆదివారం ఉదయం 9.08 నిమిషాల వరకు ఉంది. ఈ నేపథ్యంలో దశమి ఘడియలు శనివారం ఉదయం ప్రారంభమవుతాయి. దీంతో విజయ దశమి పర్వదినం శనివారం జరుపుకోవాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


ఇంతకీ దసరా పండగకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే..?

హిందూ సంప్రదాయంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా ప్రతీక. ఇది రాక్షస రాజు రావణాసురిడిపై రాముడు సాధించిన విజయానికి, అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని జయంచడాన్ని సూచికగా ఈ పండగ జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లో వివిధ ప్రాంతాల్లో ఈ దసరా వేడుకలు విభిన్న రీతుల్లో జరుగుతాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని కూలూలో సైతం దసరా పండగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ !

అదే విధంగా దసరా ఉత్సవాల నేపథ్యంలో మైసూర్‌ మహానగరంలో నవరాత్రులు ఘనం నిర్వహిస్తారు. నగరంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఇక ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణాసురుడి బొమ్మకు నిప్పంటించి దహనం చేస్తారు. ఈ నవరాత్రుల వేళ.. విజయవాడలో సైతం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మను వివిధ రూపాల్లో భక్తులకు దర్శమమిస్తారు.

Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..


ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లో దసరా...

ఇక బెంగాల్‌లో విజయ దశమి.. అక్టోబర్ 13వ తేదీ.. అంటే ఆదివారం జరుపుకుంటారు.

విజయ ముహూర్తం : మధ్యాహ్నం 02.02 నుంచి 02.49 వరకు ఉంది. అంటే కేవలం 47 నిమిషాలు మాత్రమే ఉంది.

ఉత్తరాదిలో విజయ దశమి : అక్టోబర్ 12, శనివారం జరుపుకోనున్నారు.

బెంగాల్‌లో విజయ దశమి అపరన్న సమయం: మధ్యాహ్నం 01:16 నుంచి 03:35 వరకు ఉంది.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Oct 04 , 2024 | 05:35 PM