Share News

TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:37 PM

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల
TGPSC Group 1 Mains Hall Tickets

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21 నుంచి 27 వరకు హైదరాబాద్ సెంటర్ (HMDA పరిధిలో) ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు హాల్ టిక్కెట్‌లను అధికారులు విడుదల చేశారు. TGPSC వెబ్‌సైట్ నుంచి (https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284) అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను సకాలంలో డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను 040-23542185, 040-23542187 సంప్రదించవచ్చని తెలిపారు.


ఈ రూల్స్ తప్పనిసరి

ఈ పరీక్షలు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అభ్యర్థులు తమ TGPSC గ్రూప్ 1 హాల్ టిక్కెట్లతోపాటు పాటు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌ను పరీక్ష రోజున తీసుకువెళ్లాల్సి ఉంటుంది. TGPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ తీసుకురావడంలో విఫలమైన అభ్యర్థులు పరీక్ష హాలులోకి అనుమతించబడరు. TGPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, ఫోటోగ్రాఫ్, పరీక్షా కేంద్రం, తేదీ, సమయం వంటి కొన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే, పరీక్ష ప్రారంభమయ్యే ముందు వాటిని సరిచేయడానికి అభ్యర్థులు వెంటనే అధికారులను సంప్రదించాలి.


ఖాళీలు

డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కేటగిరీ II), కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ II), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వంటి మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.


ఎన్ని పేపర్లు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఏడు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధి, 150 మార్కులను కలిగి ఉంటుంది.

  • క్వాలిఫైయింగ్ పేపర్ (జనరల్ ఇంగ్లీష్) 150 మార్కులు

  • పేపర్-1 (జనరల్ ఎస్సే) 150 మార్కులు

  • పేపర్ II (చరిత్ర, సంస్కృతి & భూగోళశాస్త్రం) 150 మార్కులు

  • పేపర్-III (ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ & రాజ్యాంగం) 150 మార్కులు

  • పేపర్-IV (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్) 150 మార్కులు

  • పేపర్-V (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్) 150 మార్కులు

  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు) 150 మార్కులు


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

Read More Education News and Latest Telugu News

Updated Date - Oct 14 , 2024 | 05:43 PM