Lok Sabha Election 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కీలక నేత రాజీనామా
ABN, Publish Date - Apr 26 , 2024 | 03:27 PM
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress party)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని ( Koneru Chini) కూడా గులాబీ పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని (Koneru Chinni) కూడా గులాబీ పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసురెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం.
CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి కోనేరు చిన్ని..!
రేపు(శనివారం)ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కోనేరు చిన్ని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా చిన్ని రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా.. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు చిన్ని పనిచేసిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో కోనేరు చిన్ని చేరారు. అయితే బీఆర్ఎస్‌లో చేరే ముందు కీలక పదువులు ఇస్తానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీపై కోనేరు చిన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ పార్టీని వీడేందుకు ఆయన సిద్ధమయ్యారు.
Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..
చేరికలపై పొంగులేటి దృష్టి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగానే ఈనెల 30వ తేదీన కొత్తగూడెంలో కేసీఆర్ పర్యటించనున్నారు. అంతకంటే ముందే బీఆర్ఎస్ పార్టీలో కోనేరు చిన్ని చేరనున్నట్లు సమాచారం. కేసీఆర్ జిల్లా పర్యటన కంటే ముందే బీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసురెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలపై మంత్రి పొంగులేటి దృష్టి సారించారు. కోనేరు చిన్నితో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. కమ్మ సామాజిక వర్గ పరంగానూ కోనేరు చిన్ని బలమైన నేత కావడంతో ఆ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కు మల్లుతుందని భావించారు. దీంతో కోనేరు చిన్నిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసురెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి భారీ వలసలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. కోనేరు చిన్నితో పాటు మరికొంత మంది నేతలు పొంగులేటికి టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేతలంతా కాంగ్రెస్‌లోకి వెళ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గడ్డుపరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ గెలవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 26 , 2024 | 03:56 PM