Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ABN, Publish Date - May 11 , 2024 | 03:29 PM
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.
ఖమ్మం: కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.
గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపం కారణంగా రెండు పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో నీటి సమస్యలతో రైతులు, కరెంట్ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ద్వజమెత్తారు. తాగునీరు విషయానికి వస్తే మిషన్ భగీరథ అద్భుతంగా కట్టాననీ, ఆ నీళ్లను మినరల్ వాటర్లా అందిస్తా అన్నారు కానీ.. ఆ పథకం ఎందుకు ఉపయోగపడటం లేదని అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.
LokSabha Elections: ఆ విషయాన్ని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పడు..
అసెంబ్లీకు అందుకే రాలేదు...
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మిషన్ భగీరథలో కమీషన్లకు కక్కుర్తి పడి నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో మిషన్ భగీరథ నీళ్లు అందించలేక పోతున్నామని అన్నారు. తిరిగి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ నెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరితే.. కాలు విరిగిందని.. ఆ నొప్పి కారణంగా రానని చెప్పిన కేసీఆర్, నల్లగొండ రైతుల వద్దకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ బంఢారం బయట పడుతుందని రాలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే ప్రచారానికి కేసీఆర్ వెళ్లి తనకు 12 ఎంపీ సీట్లు ఇస్తే మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెబుతూ.. పగటి కలలు కంటున్నాడని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీకు ఎంత మెజార్టీ ఇచ్చారో తెలుసుకోవాలన్నారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోయడం తప్పా, ప్రజలకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. ఖమ్మం ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని చెప్పారని.. ఏ పార్టీ నుంచి నామాను కేంద్రమంత్రి చేస్తారని నిలదీశారు. దేశంలో 543 ఎంపీ సీట్లు ఉంటే ఆయన గెలిచే సీట్లు ఎన్ని అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పార్టీని వేలు కూడా పెట్టనివ్వం, ఆయన ఇంటిమీద వాలిన కాకిని కూడా తమ ఇళ్ల మీద వాలనివ్వమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Loksabha Polls: హిందూ, ముస్లింలు కొట్టుకుని చావాలని బీజేపీ చూస్తోంది.. రేవంత్ ఫైర్
అది గోబెల్స్ ప్రచారమే..
‘‘కేసీఆర్ నిన్ను నమ్మి నీ పంచనా చేరేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరు. నీ పార్టీని కాపాడుకోవటం కోసం. పగటి కలలు కనొద్దు. మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి నువ్వు చేసే తప్పుడు ప్రచారాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే నీ పార్టీని గంగలో కలపడం ఖాయం. నీ తుప్పు పట్టిపోయిన కారును.. పాత ఇనుముకు అమ్ముకోవటం తథ్యం.కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తాం.బీజేపీ పార్టీకి బీ పార్టీ బీఆర్ఎస్సే. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే, నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు ఆమోదం తెలిపింది. నాటి రెండు ప్రభుత్వాలు నటించాయే తప్పా, తెలంగణ అభివృద్ధికి సహకరించలేదు. బీజేపీ కనుసైగల్లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు రూ.27 లక్షల కోట్లు టాక్స్‌ల రూపంలో చెల్లించినవే. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఫోకస్ చేస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తుంది’’ అని అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
తెలంగాణను కేసీఆర్ దివాళా తీయించారు
‘‘ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేతలు అంటున్నారు.బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు దొరికినన్ని అప్పులు చేసి, ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి దివాళా తీయించారు. లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కమీషన్ రూపంలో తీసుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ భూములకు యజమాని కావాలని ధరణిని తీసుకొచ్చారు. ధరణి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమిని కేసీఆర్ కబ్జా చేశారు. బీఆర్ఎస్ నాయకులు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేయాలని చూశారు. ఢిల్లీలో వ్యాపారం చేయాలని చూస్తే ఆయన కూతురు కవిత ఎక్కడ ఉందో మనందరికీ తెలిసిందే. అక్రమంగా సంపాదించిన సొత్తుతో జాతీయ పార్టీ పెట్టిన ప్రబుద్ధుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు, రైతుల కష్టాల గురించి కేసీఆర్ ఏనాడు ఆలోచించలేదు. ఎన్నికల తర్వాత ఫాంహౌస్‌కి కేసీఆర్ షిఫ్ట్ అయారు. ఇప్పటికీ ఆయన సీఎం అనే మత్తు నుంచి దిగలేదు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న నీ కూతురి కవితని విడిపించటానికి, అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో రాత్రి పూట కేసీఆర్ చర్చిస్తున్నారు’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు.
AP Elections: వ్యాన్-లారీ ఢీ.. బయటపడిన అట్టపెట్టెలు.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..!
రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ చూస్తున్నారు...
‘‘ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మి అభ్యర్థులను పెట్టి, బీఆర్ఎస్ ఓటును బీజేపీకి మరల్చాడానికి కుట్ర పన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హిందూ మహిళల మంగళ సూత్రాలు తెంచి ముస్లిం, క్రిస్టియన్ మహిళలకు ఇస్తారని బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. మళ్లీ ప్రధాని అయ్యేందుకు నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మీద గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే మార్చాలని చూస్తుంది. ఒకవేళ బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు మార్చడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వస్తే ఇవే మనకు చివరి ఎన్నికలు అవుతాయి, దేశంలో రాజ్యాధికారం తీసుకు రావాలని బీజేపీ భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేసినట్లు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినట్లు, నేడు బీజేపీని కూడా అలానే చేయాలి. రాష్ట్ర విభజన అంశంలో ఏ ఒక్క అంశంపై కూడా బీజేపీ సహకరించలేదు’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యాంతోనే మార్పు...
‘‘గడిచిన 25 రోజుల నుంచి పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంలో నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేశాం. ఎండను సైతం లెక్కచేయకుండా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇందిరమ్మ రాజ్యంతొనే దేశంలో మార్పు వస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక పోలింగ్ జరిగేలా చూడాలి. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో రోల్ మోడల్. అలాంటి భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ వల్ల పెను ముప్పు ఉంది. కాంగ్రెస్ పార్టీలో కులాలు, మతాలు ఉండవు. రాబోయే ఐదేళ్లలో పేదల సంక్షేమ కోసం కృషి చేస్తాం. ఇళ్లస్థలంతో పాటు, డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తాం.రైతు బంధు నాటి కేసీఆర్ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదు, మన ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాల్లో రైతుబంధు వేస్తుంది. తెలంగాణలో15 ఎంపీ సీట్లు గెలుస్తాం. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దాం. ఆయన కుటుంబం పదవుల కోసం వెంపర్లాడే కుటుంబం కాదు. రాహుల్ ప్రధానమంత్రి కావాలంటే పదేళ్ల క్రితమే అయ్యేవారు’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Lanka Dinakar: వైసీపీ నేతల్లో ఓటమి అనే నైరాశ్యం నిండిపోయి రెచ్చిపోతున్నారు
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 11 , 2024 | 04:05 PM