ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

ABN, Publish Date - May 10 , 2024 | 01:00 PM

Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

Neelam Madhu and Konda Surekha Election Campaign

సిద్దిపేట జిల్లా, మే 10: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు (MP candidate Neelam Madhu), మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం (BRS Chief KCR), హరీష్ రావు మంత్రి(Former Minister Harish Rao) అయ్యారు అంటే సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. బీజేపీ, బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేదు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే. ప్రజల పక్షాన, పేదల పక్షాన ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ’’ అంటూ నీలం మధు పేర్కొన్నారు.

YS Viveka Case: ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సునీత


కవిత లిక్కర్ స్కామ్ వల్లే...: కొండా సురేఖ

నీలం మధు పేదింటి బీసీ బిడ్డను అందరూ ఆశీర్వదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. పెళ్లి చేస్తే పిల్లకు పుట్టు మచ్చలు నుంచి చూస్తాం అలాంటిది ఐదేండ్లు మనల్ని పాలించే నాయకుడి గురించి ఓటు వేయాలన్నారు. కవిత చేసిన లిక్కర్ స్కాం వల్లే ఎంతో మంది తాగు బోతులు తయారు అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేసిందని తెలిపారు. పదేండ్లలలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని టీఆర్ఎస్ పార్టీకి ఐదు నెలలో కాంగ్రెస్ పార్టీ 2500 ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. హరీష్ రావు అంత మంచిగా అభివృద్ధి చేస్తే సిద్దిపేట ప్రచారానికి కేసీఆర్ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని.. మళ్ళీ మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే వారిని బీజేపీకి ఆమ్ముకుంటుందని విమర్శించారు. ‘‘మీకు స్వాతంత్య్రం వచ్చింది మీరు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు. వడ్డెర కులస్థులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

TS News: మా నాన్నని బతికించండి..

Hyderabad: మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉంది..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2024 | 01:34 PM

Advertising
Advertising