Share News

Epsom Salt: ఎప్సమ్ సాల్ట్ గురించి ఈ విషయం తెలుసా? దీన్ని నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:51 PM

సాధారణంగా తోటలకు, రసాయన ప్రయోగాలలోనూ ఉపయోగిస్తుంటారు. దీని వినియోగం కారణంగా మొక్కల పెరుగుదలకు బాగుంటుంది. నిజానికి ఇందులో ఉండే మెగ్నీషియం మొక్కకు ఎంతో మేలు చేస్తుంది. చెట్లు, మొక్కలతో పాటు ఈ ఉప్పును నీళ్లలో కలిపి స్నానం చేస్తే జరిగేదిదే..

Epsom Salt: ఎప్సమ్ సాల్ట్ గురించి  ఈ విషయం తెలుసా? దీన్ని నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే..!

ఎప్సమ్ సాల్ట్ పేరులో సాల్ట్ ఉంటుంది. కానీ నిజానికి ఇది మెగ్నీషియం, సల్ఫేట్ ఖనిజ సమ్మేళనం. ఎప్సమ్ సాల్ట్ ఇంగ్లండ్‌లో ఎప్సమ్ అనే ప్రాంంతంలో పండంటం వలన దీనికి ఆ పేరు పెట్టారు. ఇది సాధారణంగా తోటలకు, రసాయన ప్రయోగాలలోనూ ఉపయోగిస్తుంటారు. దీని వినియోగం కారణంగా మొక్కల పెరుగుదలకు బాగుంటుంది. నిజానికి ఇందులో ఉండే మెగ్నీషియం మొక్కకు ఎంతో మేలు చేస్తుంది. చెట్లు, మొక్కలతో పాటు ఈ ఉప్పు ఆరోగ్యానికి, చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉప్పును ఎలా ఉపయోగించాలి? దీన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

ఉపయోగించే విధానం..

ఎప్సమ్ సాల్ట్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా టబ్‌లో సువాసన లేని ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఇందులో గోరువెచ్చని నీరు కలపాలి. దీన్ని 15 నిమిషాలు అలాగే వదిలెయ్యాలి. తరువాతస సుమారు అరగంట పాటు ఈ నీటిలో పడుకోవాలి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


ప్రయోజనాలు..

ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం స్థాయిలను మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం శరీరంలోని అన్ని ఎంజైమ్‌లను నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలకు మెగ్నీషియం అవసరం. ఇది మెదడులోని సెరోటోనిన్ మొత్తాన్ని పెంచుతుంది. సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మన్. ఈ కారణంగా ఎప్సప్ సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.

ఎప్సప్ సాల్ట్ గర్భాశయాన్ని సడలిస్తుంది. తిమ్మిరికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌లను తగ్గిస్తుంది. తద్వారా పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్‌లో ఉండే సల్ఫేట్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది . ఇది పోషకాలను శోషించడానికి, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది.

Cucumber Side Effects: అరోగ్యానికి మంచిది కదా అని కీర దోస బాగా తినేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!



ఇది ఆడ్రినలిన్ స్థాయిని పెంచుతుంది. తద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది మంచి ఎక్స్‌ఫోలియంట్. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిచడంలో ఎప్సమ్ సాల్ట్ సహాయపడుతుంది. ఇది గ్లుటామేట్‌ను సమతుల్యం చేస్తుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ శరీర నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను సడలిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్సమ్ సాల్ట్‌తో స్నానం చేయడం వల్ల వైద్యం మెరుగుపడుతుంది. ఇది బెణుకులు, వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఎప్సమ్ సాల్ట్, యూకలిప్టస్ ఆయిల్ కలిపి స్నానం చేయడం వల్ల రెట్టింపు ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.

Keratin at Home: మిగిలిపోయిన అన్నంతో ఇలా చేశారంటే చాలు.. సెలూన్ స్టైల్ హెయిర్ మీ సొంతం..!


ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 23 , 2024 | 12:55 PM