కార్మికుల భద్రత నా బాధ్యత
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:00 AM
కాకినాడ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కార్మికుల భద్రత తన బాధ్యత అని, వారు భద్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, వారి భద్రతతోనే వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని కార్మిక ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం వాకలపూడి, పెద్దాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 54వ జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని కాకినాడలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిపిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కోరమండల్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, జెమిని ఎడిబుల్ ఆయిల్స్, రైస్ మిల్స్ అసోసియేషన్ ఇతర వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులతో ఆయన ప్రతిజ్ఞ చే

మంత్రి వాసంశెట్టి సుభాష్
కాకినాడలో 54వ జాతీయ భద్రత వారోత్సవాలు
కాకినాడ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కార్మికుల భద్రత తన బాధ్యత అని, వారు భద్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, వారి భద్రతతోనే వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని కార్మిక ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం వాకలపూడి, పెద్దాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 54వ జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని కాకినాడలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిపిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కోరమండల్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, జెమిని ఎడిబుల్ ఆయిల్స్, రైస్ మిల్స్ అసోసియేషన్ ఇతర వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులతో ఆయన ప్రతిజ్ఞ చే యించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వ ర్యంలో ఎస్‌ఆర్‌ఎంటీ హాలు ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించి పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రైసు మిల్లుల్లో భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పుస్తకా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నా కార్మిక కుటుంబ సభ్యులందరినీ నేరుగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు మరింత బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రత నియమాలను సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా స్థానిక భాషల్లో రూపొందించాలని మంత్రి సూచించారు. రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రసాయనాల పట్ల, వాటి వల్ల కలిగే ప్రమాదాల పట్ల శిక్షణ తరగతులు నిర్వహించాలని, ప్రమాదాలను పసిగట్టి నివారించే టెక్నాలజీని వాడుకోవాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు వసుధా మిశ్రా నేతృత్వంలో కమిటీ వేశారని, ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తూ.చతప్పకుండా పాటించాలన్నారు. యా జమాన్యాలు, కార్మికులు ప్రభు త్వ యంత్రాంగం కలిసి జీరో యాక్సిడెంట్ అనే నినాదంతో ముం దుకెళ్లాలని మంత్రి కోరారు. కార్మికలోకపు కల్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాకినాడలో బధిర విద్యార్థులను దత్తత తీసుకోవడంతో పాటు భవన మరమ్మతులు, అదనపు గదినిర్మా ణానికి ముం దుకు వచ్చిన జెమినీ ఎడిబుల్స్ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. వివిధ పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్ వర్మ, ట్రైనీ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, కాకినాడ జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేశ్, జిల్లా ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ డి.రాధాకృష్ణ, ఇన్‌స్పెక్టర మురళీకృష్ణ, జిల్లా కార్మికశాఖ అదనపు కమిషనర్ బుల్లిరాణి, పరిశ్రమలశాఖ జీఎం సీహెచ్ గణపతి, జిల్లా బాయిలర్స్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు పాల్గొన్నారు.