Share News

Peanuts: స్నాక్స్ గా వేరుశనగలు తింటే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:35 PM

సాధారణంగా ఉడికించిన లేదా వేయించిన వెరుశనగలను స్నాక్స్ లాగా తీసుకుంటారు. వేరుశనగలలో ప్రోటీన్, కొవ్వుతో పాటూ బోలెడు పోషకాలు కూడా ఉంటాయి. వీటిని రోజూ స్నాక్స్ సమయంలో తింటే..

Peanuts: స్నాక్స్ గా వేరుశనగలు తింటే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!
Peanuts

వేరుశనగలు భారతీయులకు చాలా ఇష్టమైన ఆహారం. వేరుశనగలను స్వీట్లు, వివిధ రకాల వంటల తయారీలో మాత్రమే కాకుండా స్నాక్స్ గా కూడా తింటారు. సాధారణంగా ఉడికించిన లేదా వేయించిన వెరుశనగలను స్నాక్స్ లాగా తీసుకుంటారు. వేరుశనగలలో ప్రోటీన్, కొవ్వుతో పాటూ బోలెడు పోషకాలు కూడా ఉంటాయి. వీటిని రోజూ స్నాక్స్ సమయంలో తింటే ఏం జరుగుతుందంటే..

బరువు..

వేరుశనగలు లేదా వేరుశనగ వెన్న తీసుకోవడం వల్ల బరువు తగ్గచ్చు. వారానికి కనీసం రెండుసార్లు అయినా వేరుశనగలు తినేవారిలో ఊబకాయం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. తద్వారా అతిగా తినడం తగ్గి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Belly Fat: ఉదయాన్నే ఈ పానీయాలలో ఏ ఒక్కటి తాగుతున్నా చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!


కొలెస్ట్రాల్..

రోజూ వేరుశనగలు తింటూ ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. వేరుశనగలో మోనో అన్ శాచురేటెడ్ ప్యాటీ యాసిడ్లు.. ముఖ్యంగా ఒలేయిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి చెడు కొవ్వును తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరగడంలో సహాయపడతాయి. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధిని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రోఫైల్ ను ప్రోత్సహించి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీ ఏజింగ్..

ఉన్న వయసు కంటే మరింత యవ్వనంగా కనిపించాలంటే వేరుశనగలు తినాలి. వేరుశనగలలో విటమిన్-సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా యవ్వనంగా ఉండటంలో సహాయపడతాయి.

క్యాన్సర్..

వేరుశనగలలో పాలీ ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పి-కౌమారిక్ యాసిడ్, కార్సినోజెనిక్ నైట్రోసమైన్లు ఏర్పడటాన్ని పరిమితం చేయడం ద్వారా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేరుశనగలలో రెస్వెరాట్రాల్ కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్లు ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది.

High BP: రక్తపోటు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? హై బీపీని ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తారంటే..!


స్ట్రోక్..

వేరుశనగలలో ఉండే రెస్వెరెట్రాల్ రక్తనాళాలలో పరమాణు విధానాలను మార్చడం, వాసోడైలేటర్ హార్మోన్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణను సానుకూలంగా ఉంచుతుంది.

నిరాశ..

వేరుశనగలలో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ విడుదలను పెంచుతుంది. ఇది డిప్రెషన్ తో పోరాడటానికి సహాయపడుతుంది. తక్కువ సెరోటోనిన్ స్థాయిలు తరచుగా నిరాశకు కారణం అవుతాయి.

ఇవి కూడా చదవండి..

100 Times Washed Ghee: శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !

ఈ 7 తప్పులు చేస్తే తొందరగా ముసలి వాళ్ళు అవుతారు.. !

రాత్రి సమయంలో చేసే ఈ తప్పుల వల్ల ఈజీగా బరువు పెరుగుతారు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 12 , 2024 | 03:35 PM