Elections: రెండు దశాబ్దాలు.. 60 దేశాలు.. ఎలక్షన్ మూడ్‌లోకి ప్రపంచం
ABN , Publish Date - Jan 06 , 2024 | 09:16 AM
భారత్ లో త్వరలో లోక్ సభ ఎలక్షన్లతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(India Elections) జరగనున్నాయి. మళ్లీ ఒక్కసారిగా దేశంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎలక్షన్లు భారత్ లోనే అనుకుంటున్నారా. కాదండీ.. రాబోయే రెండు దశాబ్దాల్లో దాదాపు 60 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే సగం ప్రపంచ జనాభా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది.
ఇంటర్నెట్: భారత్ లో త్వరలో లోక్ సభ ఎలక్షన్లతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(India Elections) జరగనున్నాయి. మళ్లీ ఒక్కసారిగా దేశంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎలక్షన్లు భారత్ లోనే అనుకుంటున్నారా. కాదండీ.. రాబోయే రెండు దశాబ్దాల్లో దాదాపు 60 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే సగం ప్రపంచ జనాభా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌తో సహా దాదాపు 60 దేశాలకు 2024లో ఎలక్షన్లు జరగనున్నాయి.
త్వరలో ఆఫ్రికాలో 18, ఆసియాలో 17, ఉత్తర అమెరికాలో 5, ఓషియానియాలో 4, దక్షిణ అమెరికాలో 2 దేశాలు కూడా జాతీయ ఎన్నికలను నిర్వహించనున్నాయి. ఈ ఏడాది అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇదే సందర్భం మళ్లీ 2048లో రానుంది. ప్రపంచంలోని మూడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు-- భారత్, అమెరికా, ఇండోనేసియాలలో రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇండోనేసియాలో ఫిబ్రవరి 14న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 200 మిలియన్లకు పైగా ఓటు హక్కు ఉపయోగించుకుంటారు.
భారత్ లో ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో 900 మిలియన్ల మంది ఓటు వేయనున్నారు. 160 మిలియన్ల మంది నమోదిత ఓటర్లు ఉన్న అమెరికా ప్రజలు తమ దేశ 60వ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. అమెరికాలో నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కి మద్దతు తగ్గడం, పోటీదారుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కుంటుండంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
జూన్ 6-9 మధ్య EU సహా మరో 9 యూరోపియన్ దేశాలు జాతీయ ఎన్నికలను నిర్వహించనున్నాయి. వీటిలో రష్యా, ఉక్రెయిన్ కూడా ఉన్నాయి, ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు వరుసగా మార్చి 15-17, మార్చి 31 న జరుగుతాయి. UK ప్రధాని రిషి సునక్ మాట్లాడుతూ.. తమ దేశంలో 2024 ద్వితీయార్థంలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
బిజీగా దక్షిణాసియా
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, భూటాన్ ఈ ఏడాది దక్షిణాసియానుంచి ఎన్నికలకు వెళ్లనున్న ఐదు దేశాలు. ఈ దేశాల్లో జనసాంద్రత ఎక్కువ. బంగ్లాదేశ్ ఎన్నికలు జనవరి 7న జరగనున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తోంది.
పాకిస్తాన్ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగాల్సి ఉండగా, దేశంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ సార్వత్రిక ఎన్నికలను ఆలస్యం చేస్తూ ఆ దేశ సెనేట్ జనవరి 5న తీర్మానాన్ని ఆమోదించింది. మరో సంచలన విషయం ఏంటంటే.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
ఆయన మద్దతుదారులు చాలా మంది ఇటీవల అరెస్ట్ అయ్యారు. 76 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ నాయకుడు కూడా ఐదేళ్ల పదవీకాలంలో పూర్తిగా ఉండలేదు. ఇక శ్రీలంక దేశానికి ఏడాది చివర్లో ఎన్నికలు జరగవచ్చు. 2018 నుండి దేశంలో సాధారణ ఎన్నికలు జరగలేదు. ఆ దేశ ఆర్థిక పరిస్థితే ఎన్నికల ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. వీటితోపాటు 2025లో కూడా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"