Viral Video: రాష్ట్రపతి భవన్‌లో చిరుత పులి?
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:33 AM
మన దేశంలో ఢిల్లీ(delhi)లో ఉన్న రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని సందర్శించే ప్రతి ప్రధాన దేశాధినేత గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ భవనంలో చిరుత ఉన్న వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.
మన దేశంలో ఢిల్లీ(delhi)లో ఉన్న రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని సందర్శించే ప్రతి ప్రధాన దేశాధినేత గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ భవనం 340 గదులు, మూడు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని 90 ఏళ్ల క్రితం ఎడ్విన్ లుటియన్స్ నిర్మించగా, ఈ భవనంలో కీలక కార్యక్రమాలు, విందులు జరుగుతాయి. ఇక్కడ రెండు వంటశాలలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి ప్రైవేట్ కిచెన్. మరొకటి రాష్ట్రపతి భవన్‌లోని అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, రిసెప్షన్‌లు, సమావేశాలలో క్యాటరింగ్ ఏర్పాట్లకు రెండో వంటగది బాధ్యత వహిస్తుంది.
ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ భవనంలో నిన్న నరేంద్ర మోదీ(narendra modi) మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారోత్సవం చేశారు. దీంతోపాటు మోదీ కేబినెట్‌లో అనేక మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్రమంలోనే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా మంత్రులతో ప్రమాణం చేయించారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి భవన్‌లో ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు. అప్పుడు వెనుకాల మెట్ల తర్వాత చిరుతపులి(Leopard) సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిరుతలను కూడా రాష్ట్రపతి భవన్‌లో పెంచుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది అవి చిరుతలు కాదని అంటుండగా, ఇంకొంత మంది మాత్రం అవి చిరుతలేనని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. ఈ వీడియో(viral video) మీరు ఇంకా చూడకుంటే ఓ సారి లుక్కేయండి మరి.
ఇది కూడా చదవండి:
Terror Attack: యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్
VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్ బైబై
Read More National News and Latest Telugu News