Share News

Keir Starmer Trump: ట్రంప్‌ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:16 AM

ట్రంప్‌ ఆమోదిస్తున్న వాణిజ్య విధానాలతో ప్రపంచీకరణ యుగానికి ముగింపు పలకబడిందని యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ భావిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి పెరుగుతుండగా, కొత్త శకం ప్రారంభమైందని ఆయన ప్రకటించనున్నట్లు సమాచారం.

Keir Starmer Trump: ట్రంప్‌ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు

నేడు ప్రకటించనున్న బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: ట్రంప్‌ అవలంబిస్తున్న వాణిజ్య విధానాలతో ప్రపంచీకరణ శకం ముగిసిపోయినట్టేనని యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రకటించనున్నారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనంతో ప్రారంభమైన ప్రపంచీకరణ లక్షలాది మంది ఓటర్లకు నిరాశ కలిగించిందని, ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో ప్రపంచ దేశాలపై ట్రంప్‌ అసాధారణ స్థాయిలో విధించిన 10శాతం బేస్‌లైన్‌ సుంకాలు మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయని ఆయన సోమవారం ప్రకటించడానికి రంగం సిద్ధమైందని ‘టైమ్స్‌’ నివేదిక పేర్కొంది. ఆర్థిక జాతీయవాదం విషయంలో అమెరికా దృష్టిని గుర్తించినట్లు స్టార్మర్‌ అంగీకరించే అవకాశం ఉందని తెలిపింది. ట్రంప్‌ తీవ్రమైన చర్యలతో ఏకీభవించనప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక కొత్త శకం ప్రారంభమైందని, అందులో చాలామంది అమెరికా అధ్యక్షుడి విధానాలను సమర్థిస్తున్నారని స్టార్మర్‌ యంత్రాంగం గుర్తించిందంటూ యూకేకు చెందిన ఓ సీనియర్‌ అధికారిని ఉటంకిస్తూ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 04:16 AM