Karnataka child abuse: బాలుడిని చెట్టుకు కట్టి... మర్మాంగం వద్ద ఎర్రచీమలు వదిలి...
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:08 AM
కర్ణాటక దావణగెరె జిల్లాలో ఓ బాలుడిని వక్కచెట్టుకు కట్టి చిత్రహింసలు పెట్టారు. చోరీ ఆరోపణతో యువకులు బాలుడిపై దాడి చేసి, ఎర్రచీమలతో హింసించిన ఘటన కలకలం రేపుతోంది.

కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలో ఘటన.. 9మందిపై కేసు
బెంగళూరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): చోరీ చేశాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఓ బాలుడిని వక్కచెట్టుకు కట్టి, డ్రిప్ పైపులతో దాడి చేశారు. మర్మాంగం వద్ద ఎర్రచీమలను విడిచి హింసించారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. నల్లూరు పరిధి ని హస్తాపనహళ్లి గ్రామంలో సంచారజాతులకు చెందిన బాలుడిపై అదే సామాజికవర్గానికి చెందిన యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇలా బాలుడిపై దాడి చేస్తున్న వీడియోలను తీసుకున్నారు. వీరంతా వనమూలికలు అమ్మి జీవనం సాగించేవారని చన్నగిరి పోలీసులు తెలిపారు. రెండురోజుల క్రితం జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో వైరల్ అయింది. బాలుడి తాత ఫిర్యాదుతో దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. సుభాష్ (23), దర్శన్ (22), పరశు(25), లక్కి(21), శివదర్శన్(23), హరీశ్(25), పట్టిరాజు(20), భూని(18), మధుసూదన్ (32)పై కేసు నమోదుకాగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.