Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్
ABN, Publish Date - Jun 07 , 2024 | 03:32 AM
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
పోస్టల్ బ్యాలట్ మినహా పోలింగ్ శాతం వెల్లడి
తుది గణాంకాలు త్వరలోనే విడుదల: ఈసీ
న్యూఢిల్లీ, జూన్ 6: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు. దేశ చరిత్రలోనే భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని, పోస్టల్ ఓట్ల గణాంకాలను కలుపుకుంటే పోలింగ్ శాతం ఇంకా పెరుగుతుందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా, 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంలలో నమోదయిన పూర్తి సమాచారం అందిన తర్వాత తుది గణాంకాలను వెల్లడిస్తామన్నారు. కాగా, 2019 సాధారణ ఎన్నికల్లో 91.20 కోట్ల ఓటర్లకు గానూ 61.5 కోట్ల మంది ఓటు వేశారు.
Updated Date - Jun 07 , 2024 | 03:32 AM