Share News

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Dec 11 , 2024 | 07:57 PM

బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.

Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012 నాటి బొగ్గు స్కామ్ కేసు (Coal Scam Case)లో ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారంనాడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం


నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, చైర్మన్‌లు హరిశ్చంద్ర ప్రసాద్, పిన్నమనేని త్రివిక్రమ్ ప్రసాద్‌లను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. కేసులో నిందితులుగా ఉన్న హరిశ్చంద్ర గుప్తా, కేఎస్ చోప్రా, కేసీ సమారియాలను కూడా నిర్దోషులుగా నిర్ధారించింది. ఈమేరకు 341 పేజీల తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించింది.


బొగ్గు బ్లాకుల కేటాయింపుల వ్యవహారంలో అవినీతి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 2006 విచారణకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆదేశించింది. 2012లో బొగ్గు కుంభకోణంపై కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.


ఇవి కూడా చదవండి..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

For National news And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 07:57 PM