Share News

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:10 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు (Delhi HIgh Court)లో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు. సమన్లకు స్పందించకపోవడంపై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో ఈడీ రెండు కేసులు ఫైల్ చేసింది. ఈ రెండు క్రిమినల్ కేసుల్లో రూ.15 వేల పూచీకత్తుతో కేజ్రీవాల్ బెయిల్ పొందారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. త్వరలో కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు పేర్కొంటున్నారు.

Polling stations: రాష్ట్రంలో అదనంగా 176 పోలింగ్‌ కేంద్రాలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 11:10 AM