Kejriwal Arrest: నియంతృత్వంపై పోరుకు సై.. 31న ఇండియా బ్లాక్ మెగా ర్యాలీ
ABN, Publish Date - Mar 24 , 2024 | 02:40 PM
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా బ్లాక్ కూటమి ముక్తకంఠంతో ఖండించింది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన ఆదివారం నాడు మెగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ను (Kejriwal) అరెస్ట్ చేయడాన్ని ఇండియా బ్లాక్ కూటమి ఖండించింది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన ఆదివారం నాడు మెగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
‘దేశంలో ప్రజాస్వామ్యం అపాయంలో ఉంది. డెమోక్రసీని కాపాడాల్సిన అవసరం ఉంది. నియంతృత్వాన్ని పారదోలాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, అభిమానించే ప్రతి ఒక్కరిని వేధిస్తున్నారు. వ్యవస్థలను ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అని’ ఆప్ నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మార్చి 31వ తేదీన చేపట్టే మహా ర్యాలీ రాజకీయాలకు అతీతం అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరిందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ర్యాలీ చేపడుతున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తామని తేల్చిచెప్పారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని శుక్రవారం నాడు ఇండియా బ్లాక్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిందని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: Lok Sabha Polls: మోదీపై మరోసారి అజయ్ రాయ్ పోటీ..? ఈయన ఎవరంటే..?
Updated Date - Mar 24 , 2024 | 02:40 PM