కేదార్‌నాథ్ నడక దారిలో కుంగిన భూమి
ABN , Publish Date - Sep 22 , 2024 | 02:52 AM
కేదార్‌నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు.
రుద్రప్రయాగ్, సెప్టెంబరు 21: కేదార్‌నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు. దాంతో కేదార్‌నాథ్ నుంచి తిరిగి వస్తున్న యాత్రికులు చిక్కుకుపోయారు. అప్రమత్తమైన అధికారులు వారిలో సుమారు 5,000 మందిని సురక్షితంగా తరలించారు. ఈ మార్గంలో నడవడం కష్టంగా మారడంతో వేలాది మంది యాత్రికులు తిరిగి కేదార్‌నాథ్ మందిరం వద్దకే వెళ్లిపోయారు. కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు మాత్రం మార్గాన్ని పునరుద్ధరించే వరకు ఫాటా, గుప్తకాశీ, రుద్రప్రయాగ్, శ్రీనగర్‌ల్లోనే ఉండిపోవాలని అధికారులు సూచించారు. కేదార్‌నాథ్‌కు నిర్వహిస్తున్న హెలికాప్టర్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు.