Share News

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

ABN , Publish Date - Mar 21 , 2024 | 09:23 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున పిటిషన్‌లో విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఈడీ (ED)కఠిన చర్యలు తీసుకోకూడదని పేర్కొన్నారు.

500కే సిలిండర్‌.. 75కే లీటర్‌ పెట్రోల్‌

ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్ నేతృత్వంలోని ధర్మాసరం ఇవాళ ఈ కేసుపై విచారణ జరపనుంది. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటి వరకూ 9 సమన్లు పంపింది. తాజాగా తొమ్మిదో సమన్లు పంపిన ఈడీ.. మార్చి 21న (నేడు) అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. అంతకుముందు.. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఆయనకు బుధవారం కోర్టు నుంచి తక్షణ ఉపశమనం లభించలేదు. ఢిల్లీ హైకోర్టు ఈడీ నుంచి సమాధానం కోరగా, 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 22న కోర్టు చేపట్టనుంది.

58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు అనుమతి ఎలా?

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరిలు వాదించారు. పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సమర్పించిన సమన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం సమన్లపై సమాధానం చెప్పాలంటూ ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది.

నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని చార్జిషీట్లు?

కాగా.. మార్చి 21న అంటే నేడు కేజ్రీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. సమన్ల దాటవేతపై ఈడీ కేసు నమోదు చేసింది. పాలసీ రూపకల్పన, ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు అంశాలపై ఈ కేసులో ఆప్ చీఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరుతోంది. దీనిపై కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఈడీ సమాధానం చెప్పాలని కోరింది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించిన వారు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని, ఫలితంగా తమకు అనవసరమైన ప్రయోజనాలు చేకూర్చాయని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

దేశంలో స్టార్టప్‌ విప్లవం

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 09:23 AM