Share News

Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా గుడ్ బై

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:18 AM

సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ నుంచి పోటీ గెలుపొందారు. 2014, 2019లో శివసేన నేత అర్వింద్ సావంత్ చేతిలో ఓడిపోయారు.

  Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా గుడ్ బై

ముంబై: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మిలింద్ దేవరా (Milind Deora) రాజీనామా చేశారు. ‘పార్టీతో 55 ఏళ్ల అనుబంధం వీడింది. ఇన్నిరోజులు మద్దతు నిలిచిన కార్యకర్తలు, సహచరులు, పార్టీ నేతలు ధన్యవాదాలు అని’ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దేవరా (Murli Deora) కుమారుడు మిలింద్ దేవరా. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ నుంచి పోటీ గెలుపొందారు. 2014, 2019లో శివసేన నేత అర్వింద్ సావంత్ చేతిలో ఓడిపోయారు. మిలింద్ దేవరా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 09:54 AM