Bhanu prakash Vs Bhumana: గోసాల పరిశీలనకు రా.. కరుణాకర్‌కు భాను ప్రకాష్ సవాల్
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:10 PM
Bhanu prakash Vs Bhumana: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు.

తిరుపతి, ఏప్రిల్ 11: ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Former Chairman Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అపద్ధపు ఆరోపణలు చేయడం కాదని.. గోసాల పరిశీలనకు రావాలని కరుణాకర్ రెడ్డికి భానుప్రకాష్ ఛాలెంజ్ విసిరారు. శ్రీవారిని కించపరిచే విధంగా వ్యవహారాలు నడిపిన చరిత్ర కరణాకర్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. ఆయన వస్తే అన్ని రికార్డులను చూపిస్తామన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరుణాకర్ రెడ్డికి తగదన్నారు. లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని హెచ్చరించారు. శ్రీవారి ప్రసాదాలకు వాడిన పదార్థాలు కూడా నాణ్యమైనవి కాదని ఇప్పటికే నివేదికలు ఉన్నాయన్నారు. ‘నేను ఉంటా, అధికారులు ఉంటారు. టీటీడీ గోసాలను కరుణాకర్ రెడ్డి పరిశీలన చేయవచ్చు’ అంటూ సవాల్ చేశారు. అనారోగ్యంతో చనిపోయిన గోవుల వివరాలను టీటీడీ రికార్డులను నిర్వహిస్తోందన్నారు. కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీలో పెద్దఎత్తున నిధులను దారి మళ్లించిన ఘనత ఆయనదే అంటూ భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jogi Ramesh CID Inquiry: సీఐడీ విచారణపై జోగి రమేష్ ఏమన్నారంటే
ఇంతకీ కరుణాకర్ ఏమన్నారంటే..
తిరుపతి: గోవులు దేవుళ్ళలతో సమానమని.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వర స్వామీకి ప్రీతికరమైనది గోమాత అని చెప్పుకొచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని తెలిపారు. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నారని విమర్శించారు. ఎస్వీ గోశాలలో గోవులను దుస్థితి దారుణంగా ఉందన్నారు.
వందకు పైగా ఆవులు చనిపోయాయని... ఆ లెక్కలు, ఆవుల మృతి బయటకు రాకుండా చూశారని ఆరోపించారు. పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్నారు. ఈ మహాపాపం టీటీడీ ది, ప్రభుత్వానిది కాదా అంటూ ప్రశ్నించారు. గోశాలపై పర్యవేక్షణలో అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్వీ గోశాల నుంచి తిరుమలకు పాలు వెళతాయని... స్వామీ వారికి నైవేద్యంగా వెన్న ఇక్కడ నుంచి ఇస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో గుజరాత్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకోచ్చి స్వామికి వారి సేవలు అందించామని చెప్పుకొచ్చారు. 580 ఆవులను వైసీపీ ప్రభుత్వంలో తీసుకోచ్చామన్నారు. వైసీపీ పాలనలో 1500 లీటర్ల పాలు తిరుమలకు రోజూ అందించామని... ఇప్పుడు కూటమీ ప్రభుత్వంలో ఐదు వందల లీటర్ల పాలు కూడా తిరుమలకు వెళ్ళడం లేదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
BRS Warangal Meeting: వరంగల్ బీఆర్‌ఎస్ సభపై హైకోర్టు ఏం తేల్చిందంటే
Read Latest AP News And Telugu News