ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

ABN, Publish Date - Jul 14 , 2024 | 05:06 AM

ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....

ముంబై, జూలై 13: ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలో దాదాపు 8 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఈ గణాంకాలు ప్రతిపక్షాల నోటికి తాళం వేశాయని, దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిని ప్రజలు ముందు నిలబెట్టాయని మోదీ అన్నారు. అలాగే, ముంబైలోని అటల్‌ సేతు వంతెన విషయంలో ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. అటల్‌ సేతు వంతెనపై ప్రతి రోజు 20 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, ప్రతి రోజు పెద్ద ఎత్తున ఇంధన ఆదా జరుగుతోందని వివరించారు.

Updated Date - Jul 14 , 2024 | 05:07 AM

Advertising
Advertising
<