Rahul Gandhi: రాహుల్‌కు రూ.20 కోట్ల స్తిర, చరాస్తులు.. ఆసక్తికర విషయం ఏంటంటే..
ABN, Publish Date - Apr 04 , 2024 | 11:48 AM
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళలోని వయనాడ్ (Wayanad) నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
Lok Sabha Polls: బీజేపీ మేనిఫెస్టో లీక్.. కొత్త పథకాలు ఇవే..
ఇక ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌కు రూ.20 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. రూ.9.24కోట్లు చరాస్తులు, రూ.11.14 కోట్ల స్థిరాస్తులు, రూ.55 వేల నగదు, రూ.26.25 లక్షలు బ్యాంక్ డిపాజిట్లు, రూ.4.33 కోట్లు బాండ్లు, రూ.3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల గోల్డ్ బాండ్లు, రూ.4.20 విలువైన ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే.. ఢిల్లీలోని మెహ్రౌలీలో వ్యవసాయ భూమి ఉందని.. దానిలో తన సోదరి ప్రియాంక గాంధీకి సైతం వాటా ఉందన్నారు. ఇది తమకు వారసత్వంగా దక్కిన ఆస్తిగా పేర్కొన్నారు.
PM Modi: 3 రోడ్‌షోలు.. 3 బహిరంగ సభలు.. నాలుగు రోజులపాటు మోదీ ప్రచారం
అలాగే గురుగ్రామ్‌లో ఒక ఆఫీస్ ఉందని.. దాని విలువ రూ.9 కోట్లని రాహుల్ తెలిపారు. తనకు రూ.49.7లక్షల రుణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. రాహుల్ తనకు సొంత వాహనంగానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక తనపై ఉన్న కేసుల విషయానికి వస్తే.. బీజేపీ నేతలు పరువు నష్టం కేసులు పెట్టారని.. అలాగే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కి సంబంధించిన క్రిమినల్ కేసులున్నాయన్నారు.
Lok Sabha Polls: మాజీ సీఎంను పక్కన పెట్టిన బీజేపీ.. అసలు కారణం అదేనా..?
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 04 , 2024 | 12:36 PM