Share News

Ratan Tata: రతన్ టాటా చివరి పోస్టు ఇదే.. కన్నీరు పెడుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Oct 10 , 2024 | 08:01 AM

తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చానని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంది.. పుకార్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు. సరిగ్గా ఆయన పోస్టు చేసిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన లాస్ట్ పోస్టు..

Ratan Tata: రతన్ టాటా చివరి పోస్టు ఇదే.. కన్నీరు పెడుతున్న నెటిజన్లు..
Ratan Tata

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రాగా.. వాటిపై రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చానని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంది.. పుకార్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు. సరిగ్గా ఆయన పోస్టు చేసిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన లాస్ట్ పోస్టు వైరల్ అవుతుంది. రతన్ టాటా చనిపోవడానికి ముందు చేసిన చివరి ట్వీట్ ఇదే. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వ్యాపార దిగ్గజం అయినా.. అందులోనూ ప్రజాకోణాన్ని చూసేవారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రజల కోసం వెనుకడుగు వేసేవారు కాదు. ప్రయోగాలు చేయడంలో రతన్ టాటా ఒకడుగు ముందుండేవారు. ఆయన ఆలోచనలు నిత్య నూతనంగా ఉండేవి. ఓ సామాన్య మానవుడి ఆకాంక్షలను నెరవేర్చేడమే లక్ష్యంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కార్పొరేట్ స్టైల్‌లోనే సామాన్యుడికి ప్రతి వస్తువు అందుబాటులో ఉండేందుకు టాటా సంస్థల ద్వారా రతన్ టాటా విశేష కృషి చేశారు.

Ratan Tata: వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..


రతన్ టాటా చివరి పోస్టు..

రతన్ టాటా అక్టోబర్7వ తేదీన తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయొద్దని కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పోస్ట్ చేసిన మూడు రోజులకే దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన చివరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ట్వీట్‌పై పలు రకాలుగా స్పందిస్తూ.. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Ratan Tata : పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా కన్నుమూత

రతన్ టాటా గొప్పతనం..

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేశారు. 1991లో జేఆర్‌డీ టాటా అనంతరం టాటా సన్స్‌ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్‌లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ, ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్‌ ఆయన హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టాటా పవర్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్‌ను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు.. తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 10 , 2024 | 09:46 AM