Share News

Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్' ఫలితాలపై సోనియాగాంధీ ఫస్ట్ రియాక్షన్

ABN , Publish Date - Jun 03 , 2024 | 02:53 PM

పోల్‌స్టర్స్ ఏదైతే అంచనా వేశారో దానికి పూర్తి భిన్నంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వస్తాయని తాను ఆశాభావంతో ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియగాంధీ అన్నారు. ''ఏం జరుగుతుందో వేచి చూద్దాం'' అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్' ఫలితాలపై సోనియాగాంధీ ఫస్ట్ రియాక్షన్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుడటంతో రాబోయే ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలనే ప్రతిబింబిస్తాయా? అందుకు భిన్నంగా ఉండబోతున్నాయా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ (Exit poll) ఫలితాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) మంగళవారంనాడు తొలిసారి స్పందించారు. పోల్‌స్టర్స్ ఏదైతే అంచనా వేశారో దానికి పూర్తి భిన్నంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వస్తాయని తాను ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. ''ఏం జరుగుతుందో వేచి చూద్దాం'' అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్పాయి?

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భారీ మెజారితో గెలుస్తుందని, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని, కొన్ని 350కు పైగా వస్తాయని చెప్పాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు 272 సీట్లు గెలుచుకుంటే మెజారిటీ మార్క్ దాటినట్టే.

PM Modi: దేశాభివృద్ధి కలలు సాకారం చేసుకోవాలి.. మోదీ సుదీర్ఘ లేఖ


మోదీ ఫాంటసీ..

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను 'ఇండియా' కూటమి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఎగ్జిట్ పోల్స్‌ను ''మోదీ మీడియా పోల్''గా రాహుల్ గాంధీ అభివర్ణించారు. మోదీ ఫాంటసీ పోల్‌ను ఫలితాలు ప్రతిబింబించాయని అన్నారు. పంజాబ్ సింగర్ పాపులర్ సాంగ్‌ను ప్రస్తావిస్తూ ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 03:16 PM