Share News

Palika Bazar: అనుమానాస్పద ఎలక్ట్రానికి పరికరం స్వాధీనం..ఇదెంత డేంజర్ అంటే

ABN , Publish Date - Oct 27 , 2024 | 02:31 PM

పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. మొబైల్ నెట్‌వర్క్ జామర్ తరహాలో ఇది పనిచేస్తుందని, మొబైల్ నెట్‌వర్క్ జామర్‌గా పనిచేసే ఎలాంటి పరికరాన్ని అమ్మినా అది చట్టవిరుద్ధమవుతుందని తెలిపారు.

Palika Bazar: అనుమానాస్పద ఎలక్ట్రానికి పరికరం స్వాధీనం..ఇదెంత డేంజర్ అంటే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు, ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలో బాంబు పేలుడు ఘటనతో పోలీసులు ముమ్మరం గాలింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పాలికా బజార్‌ (Palika Bazar)లోని ఓ దుకాణంలో అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. ఇది మొబైల్ నెట్‌వర్క్ జామర్ తరహాలో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రానికి పరికరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Mumbai stampede: రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికిపైగా తీవ్ర గాయాలు


పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. మొబైల్ నెట్‌వర్క్ జామర్ తరహాలో ఇది పనిచేస్తుందని, మొబైల్ నెట్‌వర్క్ జామర్‌గా పనిచేసే ఎలాంటి పరికరాన్ని అమ్మినా అది చట్టవిరుద్ధమవుతుందని తెలిపారు. ప్రస్తుతం క్షణ్ణంగా ఆ పరికరాన్ని పరిశీలిస్తున్నామని, అది పూర్తయిన తర్వాత దుకాణం యజమానిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


కాగా, ఇటీవలే ప్రశాంత్ విహార్ ప్రాంతంలో భారీ శబ్దంపై బాంబు పేలుడు ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఘటనా స్థలంలో తెల్లటి పౌడర్‌లాంటి పదార్ధం కనిపించడంతో శాంపుల్స్ సేకరించారు. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్, ఎన్‌ఎస్‌జీ టీమ్‌లు దీనిపై విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి...

Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 27 , 2024 | 02:43 PM