Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
ABN , Publish Date - Mar 31 , 2024 | 02:44 PM
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు, పని చేస్తున్న వారు టిక్కెట్లు దక్కించుకుని విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు, పని చేస్తున్న వారు టిక్కెట్లు దక్కించుకుని విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రుల తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. వారు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరిస్తుంటారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పోటీకి వెనకడుగు వేశారు. ఇలా ఆర్థిక మంత్రులు పోటీ చేయకుండా ఉండటం ఇదే తొలిసారి కాదు. 1984 తర్వాత 8 మంది ఆర్థిక మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు. తాను తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ ఆఫర్ చేసినా తాను నిరాకరించినట్లు నిర్మలా సీతారామన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి ఆర్థిక మంత్రి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. 1984 తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న ఏ నాయకుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒకవేళ వారు పోటీ చేసినా విజయం మాత్రం సాధించలేదు. 1980లో ఇందిరాగాంధీ మూడోసారి ప్రధాని అయినప్పుడు ఆమె ప్రభుత్వంలో ఆర్ వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీలకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆర్థిక మంత్రులిద్దరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న శంకర్ రావు చవాన్ కూడా 1989లో ఎన్నికలలో పోటీ నుంచి వైదొలిగారు.
Dwarka: దేవభూమి ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు దుర్మరణం..
1991లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ పార్టీ పి.వి.నరసింహారావును ప్రధానిని చేసింది. రావు తన మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్‌ను చేర్చుకున్నారు. 1996, 2004, 2009 ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ పోటీ చేస్తారని చర్చ జరిగింది. అయినప్పటికీ ఆయన మాత్రం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2004లో తొలిసారిగా ప్రధాని అయినప్పుడు సైతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. వాజ్ పేయ్ హయాంలో ఇద్దరు ఆర్థిక మంత్రులుగా పని చేశారు. జశ్వంత్ సింగ్ మొదటి 3 సంవత్సరాలు, అనంతరం యశ్వంత్ సిన్హా సేవలు అందించారు. రెండోసారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇద్దరు ఆర్థిక మంత్రులుగా పని చేశారు. కానీ వారెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం ఇద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు.
Viral Video: అడవిలో ఎలుగుబంట్ల పోరాటం.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
2014లో పి. చిదంబరం ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ఆ సమయంలో ఆయన శివగంగై ఎంపీగా ఉన్నారు. తన తనయుడు కార్తీ చిదంబరాన్ని పార్టీ ఇక్కడి నుంచి అభ్యర్థిగా చేసింది. కాగా ఈ ఎన్నికల్లో కార్తీ విజయం సాధించలేకపోయారు. 2014 నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు న్యాయవాది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా చేశారు. పీయూష్ గోయల్ జనవరి 2019 నుంచి ఫిబ్రవరి 2019 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను పొందారు. మోదీ ప్రభుత్వం రెండో దఫాలో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. సీతారామన్ ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
Telangana: ఒక్కో ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి.. మాజీ మంత్రి పువ్వాడ..
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.