Share News

Yogi Adityanath: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి అదిరిపోయే గిఫ్ట్

ABN , Publish Date - Oct 30 , 2024 | 03:33 PM

దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.

Yogi Adityanath: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి అదిరిపోయే గిఫ్ట్

లక్నో: దీపావళి (Diwali) పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీన పండుగ సెలవు ఉండగా, అదనంగా నవంబర్ 1వ తేదీని కూడా హాలిడేగా ప్రకటించారు. నవంబర్ 2వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం కావడంతో ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజులు సెలవు దక్కినట్టు అవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు పండుగ సంబరాల్లో పాలుపుంచుకునే అవకాశం కలుగుతుంది.

Arvind Kejriwal: దీపావళికి ఒకరోజు ముందు కేజ్రీవాల్ షాక్


దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి. హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్‌ను ఘనంగా నిర్వహించనుంది. సరయూనది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ఈ ఏడాది సరికొత్త గిన్నెస్ రికార్డును నెలకొల్పనుంది.


ఉత్తరాఖండ్‌లోనూ...

కాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బాటలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఒకరోజు అదనపు హాలిడేను ప్రకటిచింది. నవంబర్ 1న కూడా హాలిడే ప్రకటించడంతో శని, ఆదివారాలతో కలిసి నాలుగు రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ బ్రేక్ లభిస్తుంది.


ఇవి కూడా చదవండి..

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

For National News And Telugu News...

Updated Date - Oct 30 , 2024 | 04:23 PM