Hair Damage : జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
ABN , Publish Date - Mar 08 , 2024 | 01:39 PM
చుండ్రు ఒక్కసారి మొదలయిందంటే ఓ పట్టాన వదలదు. దీనిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సరైన నూనెలు, నివారణలు అవసరం. అలాగే తల శుభ్రంగా కూడా ఉండాలి.
జుట్టు పొడవుగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అయితే ఇప్పటి కాలంలో చాలా వరకూ కాలుష్యం కారణంగా, సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే శరీరానికి కావాల్సిన పోషణ మాత్రమే ఆహారంలో తీసుకుంటే సరిపోదు.. శిరోజాల అందాన్ని పెంచే విధంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడం చాలా మంది మహిళలను వేధిస్తుంటుంది. ఈ సమస్య తగ్గడానికి రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు. ఇలాంటివి హెయిర్ పెరిగే కంటే ఊడిపోతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే మాత్రం..
జుట్టు పెరుగుదల సగటు రేటు నెలకు అర అగుళం మాత్రమే పెరుగుతుందట. జుట్టు పెరుగుదలను పెంచాలంటే మాత్రం ముందుగా ఆహారంలో మార్పు చేయక తప్పదు. అందులో ప్రోటీన్, విటమిన్లు, ఇనుము, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉండాలి. బయోటిన్ అని పిలిచే విటమిన్ బి7 జుట్టు పెరగడానికి చాలా ముఖ్యంగా కావాలి. రోజూ ఒక గిన్నె మొలకలు తీసుకోవాలి. వీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. పోషకాల ద్వారానే జుట్టుకు బలం అందుతుంది.
జుట్టు పెరుగుదలను పెంచాలంటే..
జుట్టు పెరుగుదలకు వేడి నూనె థెరపీ ఉపయోగపడుతుంది. తేలికపాటి మసాజ్ తో నూనె వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. భృంగరాజ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనెతో మర్దనా చేయడం వల్ల జుట్టు రాలిపోవడాన్ని తగ్గించవచ్చు. వీటిలోని విటమిన్ ఇ వెంట్రుకల కుదుళ్ళను బలోపేతం చేస్తాయి. పెరుగుదలను అడ్డుకునే ప్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
ఇది కూడా చదవండి: ఎదిగే పిల్లల్లో ఎముకలు బలంగా పెరగాలంటే మాత్రం ఇలా చేయండి.
చుండ్రు కూడా జుట్టు పెరుగుదలకు అడ్డంకే..
చుండ్రు ఒక్కసారి మొదలయిందంటే ఓ పట్టాన వదలదు. దీనిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సరైన నూనెలు, నివారణలు అవసరం. అలాగే తల శుభ్రంగా కూడా ఉండాలి.
తలస్నానం తరచుగా..
తలస్నానం తరచుగా చేయడం కూడా జుట్టు పెరుగుదలమీద ప్రభావం చూపుతుంది. జిడ్డుగల జుట్టుకు వారానికి మూడు సార్లు తలస్నానం సరిపోతుంది. పొడి జుట్టు ఉన్న వారికి వారానికి రెండు సార్లు తలంటు సరిపోతుంది. తలస్నానం వల్ల జుట్టుకు హాని కలగదు. అయితే తేలికపాటి హెర్బల్ షాంపూని వాడాలి. జుట్టును నీటిలో బాగా కడిగిన తర్వాత మాత్రమే షాంపూ ఉపయోగించాలి. టవల్ తో రుద్దడం మానుకోవాలి. టవల్ తల చుట్టూ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంచాలి.
బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే.. ఈ చిట్కాలు పాటించి చూడండి..!
ఇలాంటి జాగ్రత్తలతో జుట్టు పెరుగుదలను పెంచవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన షైనింగ్‌తో ఉండే జుట్టును పొందవచ్చు. ఎక్కువ శాతం జుట్టుకు కావాల్సిన ఆహారంతోపాటు తేలికపాటి కెమికల్స్ లేని సహజ ఉత్పత్తులతో తలంటు పోసుకోవడం కూడా జుట్టు పెరుగుదలలో పాత్ర పోషిస్తాయి. నిజానికి సహజ సిద్ధమైన నూనెలు, గోరింటాకు, ఉసిరి, భృంగరాజ్ వంటి ఔషద మొక్కలతో చేసిన ఫ్యాక్స్ వెంట్రుకలకు బలాన్నిస్తాయి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.