Share News

Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!

ABN , Publish Date - Jul 04 , 2024 | 04:22 PM

రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో పసుపు మొదటిది. ఇది మనం నిత్యం వంటకాల్లో పదార్థాల్లో వాడే వస్తువే. అయితే వానాకాలం రాగానే త్రాగే నీటిలో కాస్తంత పసుపు వేసుకుని మరిగించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!
Monsoons Tips

కాలం మారుతుందంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలంతోపాటే రోగాలు, అంటువ్యాధులు పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మాత్రం శరీరం అన్నింటినీ తట్టుకునే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలి. దీనికోసం సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు రోగనిరోధక శ్కతిని బలోపేతం చేసుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడంతో, రోగనిరోధక శక్తి బలంగా ఉండి, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో పసుపు మొదటిది. ఇది మనం నిత్యం వంటకాల్లో పదార్థాల్లో వాడే వస్తువే. అయితే వానాకాలం రాగానే త్రాగే నీటిలో కాస్తంత పసుపు వేసుకుని మరిగించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పసుపు పాలను రాత్రి సమయంలో తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. శరీరంలో శక్తి పెరుగుతుంది. పసుపులో ఉన్న పోషకాల కారణంగా ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!

1. అల్లం కూడా రోగనిరోధక శక్తిని పెంచే మంచి గుణాలున్న హెర్బ్ కనుక వర్షాకాలంలో వచ్చే గొంతునొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి అల్లం రక్షిస్తుంది.

2. వానలు పడటం మొదలు ప్రతి రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేసి ఉంచిన నీటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఫీవర్స్ ప్రమాదం దీనితో తగ్గుతుంది.


Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!

3. బరువు తగ్గాలనుకునే వారికి అశ్వగంధ మంచి శక్తివంతమైన మూలికగా పనిచేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అశ్వగంధ శక్తివంతంగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు శరీరాన్ని లోపల నుంచి బలోపేతం చేసేందుకు చక్కని సామర్థ్యం కలిగిన మూలిక ఇది.

4. దాల్చిన చెక్కలో ఎన్నో సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ముఖ్యంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్కను వేసి టీ తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 04 , 2024 | 04:22 PM