Share News

Story : అపాయంలో ఉపాయం

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:10 PM

ఒక అడవిలోని కొలనులో ఒక తాబేలు నివసించేది. అది ఒక సాయంత్రం కొలనులోనుంచి బయటకు వచ్చి అటుఇటు తిరుగుతూ ఉంది, దూరవంనుండి ఓ నక్క

Story : అపాయంలో ఉపాయం

ఒక అడవిలోని కొలనులో ఒక తాబేలు నివసించేది. అది ఒక సాయంత్రం కొలనులోనుంచి బయటకు వచ్చి అటుఇటు తిరుగుతూ ఉంది, దూరవంనుండి ఓ నక్క అటుగా రావడం చూసిన తాబేలు నీళ్లలోకి వెళ్లిపోవాలి అనుకున్నది,కానీ ఈలోగానే దాన్ని ఆ నక్క చూసింది నక్క తాబేలును తినాలి అనుకుని దగ్గరగా వచ్చితాబేలు డిప్ప మీద దాకి ఇదేమిటి ఆఇంత గట్టిగా ఉంది అన్నది. విషయం అర్థమైన తాబేలు నక్కతో ఇలా అన్నది. ‘ఓ నక్కబావా నేను నీళ్లలో ఉన్నంత సేపే మెత్తగా ఉంటాను నీళ్లలో నుండి బయటకు రాగానే ఇలా గట్టిపడిపోతాను కాబట్టి నన్ను మరలా కాసేపు నీళ్లలో నాననివ్వు.అపుడు నన్ను తిందువుగాని’ అన్నది. ఆ మాటలు జిత్తులమారి నక్క కొంత వరకే నమ్మింది.తాబేలు తననుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా చూడాలి అనుకుంది.


తాబేలును నీళ్లలో మునగనిచ్చి తాబేలు డిప్ప మీద తన కాలును అదిమిపట్టి తాబేలు తప్పించుకుని పోకుండా చూసింది. కాసేపటి తర్వాత తాబేలు ‘పక్క బావా నేను మొత్తంనీళ్లలో నాని మెత్తబడ్డాను ఒక్క నువ్వు కాలు అదిమి పెట్టిన ప్రదేశంలో తప్ప. కాబటిట్ట, ఆకాలును కొద్దిగా పక్కకితీస్తే,నేను అక్కడ కూడా మెత్తబడిపోయి వస్తాను అనగానే అది నమ్మిన నక్కతనకాలు పక్కకు జరిపింది. ఇదేఅదనుగా తాబేలు చటుక్కున కొలనులోకి జారి మాయమైపోయింది.

Updated Date - Sep 25 , 2024 | 11:10 PM