ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Ministers: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సేవలో మంత్రులు

ABN, Publish Date - Nov 23 , 2024 | 07:59 AM

యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల‌ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం‌ అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో రూ.210 కోట్ల వ్యయంతో చేపట్టే మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.

1/7

మంత్రులకు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఈవో ఏ.భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు కొండకింద వైకుంఠద్వారం వద్ద ప్రభుత్వ విప్‌ అయిలయ్య మంత్రులకు శాలువా కప్పి సన్మానించారు.

2/7

అర్చకులు మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కొండకింద మూడో ఘాట్‌ రోడ్డు వద్ద రూ. 210కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ పైలాన్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు.

3/7

ఆలేరు నెత్తిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలేరుకు తాగు, సాగునీరు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

4/7

ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం పెండింగ్ మిషన్ భగీరథ పైప్ లైన్ల పనుల కోసం రూ.210 కోట్లతో పనులు ప్రారంభించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

5/7

ఒకటిన్నర టీఎంసీల కెపాసిటితో నెలన్నర రోజుల్లో గందమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించామని.. పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఆలేరు ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు కక్షకట్టారో అర్థం కాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

6/7

ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేసీఆర్ పగబడితే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు ఖతం చేశారని అన్నారు. ఆలస్యమైనా రైతులందరికీ న్యాయం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

7/7

మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తయితే 523 గ్రామాలు, 3 నియోజకవర్గాలకు తాగునీరు అందుతుందని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్‌లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అనుమతి లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 08:01 AM