Share News

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:26 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Konidela Pawan Kalyan) రంగంలోకి దిగిపోయారు..! పవన్ ఆన్ డ్యూటీ అంటూ అధికారులను హడలెత్తిస్తున్నారు..! బాధ్యతలు స్వీకరించిన రోజు, ఆ మరుసటి రోజు పది గంటలపాటు వరుస సమీక్షలతోనే బిజిబిజీగా గడిపారు. ..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Konidela Pawan Kalyan) రంగంలోకి దిగిపోయారు..! పవన్ ఆన్ డ్యూటీ అంటూ అధికారులను హడలెత్తిస్తున్నారు..! బాధ్యతలు స్వీకరించిన రోజు, ఆ మరుసటి రోజు పది గంటలపాటు వరుస సమీక్షలతోనే బిజిబిజీగా గడిపారు. దీంతో పవన్ దెబ్బకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆయన ఎప్పుడేం అడుగుతారో..? ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారట. పవన్‌కు కేటాయించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల వందకు వంద శాతం న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారని జనసేన చెప్పుకుంటోంది.


Pawan-Kalyan.jpg

ఏం జరిగింది..?

శుక్రవారం నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం నేరుగా తన చాంబర్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్.. మళ్లీ రివ్యూ సమావేశాలతో బిజి అయిపోయారు.పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీశారు. అసలు ఈ నిధులన్నీ సీఎఫ్ఎంయస్‌కు ఎందుకు మళ్లించారని అధికారులను పవన్ నిలదీశారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను ఇష్టానుసారం ఎందుకు మళ్లించారు..? అని సంబంధిత అధికారులపై పవన్ కన్నెర్రజేశారు. నిధులు ఏమేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు, సీరియస్ అంశమన్నారు.


PAwan-kalyan-Officers.jpg

ఎందుకు.. ఏమైంది..?

శుక్రవారం మధ్యాహ్నం పంచాయతీరాజ్, పురపాలకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఛీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపుపై పవన్ నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత..? సీఎఫ్ఎంఎస్‌కు ఎంత మళ్లించారు..? ఎందుకు మళ్లించారు..? ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారు..? అనేది పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలని ఛీఫ్ సెక్రటరీని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధులు మళ్లింపుపై పవన్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమిలారు. అనంతరం.. గ్రామాలు, పట్టణాళ్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుంటూరు, విజయవాడలో డయేరియా వచ్చి మనుషులు చనిపోవడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు అధికారులు బదులిస్తూ.. నిధులు లేవని చెప్పారు. అసలు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు..? అని మరోసారి అధికారులను పవన్ నిలదీయడం జరిగింది. మొత్తానికి చూస్తే పవన్ పూర్తిగా రంగంలోకి దిగిపోయారన్న మాట.

Updated Date - Jun 21 , 2024 | 04:27 PM