Share News

Viral video: వామ్మో..! తల్లిని మించిపోయిన దూడ.. ఏనుగుకు ఎదురుగా వెళ్లి మరీ..

ABN , Publish Date - Jun 16 , 2024 | 07:09 PM

సినిమా తరహా సంఘటలను కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు మనుషుల విషయంలోనే కాకుండా అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ జరుగుతుంటాయి. ఈ తరహా...

Viral video: వామ్మో..! తల్లిని మించిపోయిన దూడ.. ఏనుగుకు ఎదురుగా వెళ్లి మరీ..

సినిమా తరహా సంఘటలను కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు మనుషుల విషయంలోనే కాకుండా అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ జరుగుతుంటాయి. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ దూడ తల్లిని కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఏకంగా ఏనుగుకు ఎదురుగా వెళ్లి మరీ భయపెట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అడవి మధ్యలోని దారి గుండా ఓ పెద్ద ఏనుగు వెళ్తూ ఉంటుంది. అంతలో దానికి ఓ గేదె తన పిల్లతో కలిసి ఎదురువుతుంది. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో గానీ.. ఏనుగును చూడగానే దూడకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఏకంగా ఏనుగుకు ఎదురుగా వెళ్తుంది. అంత చిన్న దూడ ఎదురుగా రావడం చూసిన (calf scared the elephant) ఏనుగు.. భయంతో వెనకడుగు వేస్తుంది.

Viral video: అరచేతి సైజు కూడా లేని ఈ తాబేలు.. అంతపెద్ద సింహాన్ని సైతం..


అప్పటికీ వదలని దూడ.. ఏనుగు మరింత దూరం వెంబడిస్తుంది. అయితే దూడపై ఏనుగు ఎక్కడ దాడి చేస్తుందేమో అనే భయంతో గేదె కంగారుపడుతుంది. దూడ వెంటే పరుగెడుతూ దాన్ని వారించే ప్రయత్నం చేస్తుంది. అయితే దూడ మాత్రం ఎలాంటి భయం లేకుండా ఏనుగును పరుగులు పెట్టిస్తుంది. చివరకు ఏనుగే తోక ముడుస్తుంది. ‘‘ఈ దూడతో ఎందుకొచ్చిన గొడవ’’.. అని అనుకుందో ఏమో గానీ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది.

Viral video: మసాజ్ చేస్తున్న సమయంలో.. కస్టమర్ కళ్లు మూసుకోగానే.. ఇతడు చేసిన నిర్వాకం..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ ఫోన్లలో రికార్డ్ చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దూడ ధైర్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తల్లిని మించిపోయిన దూడ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 16 , 2024 | 07:09 PM