Viral: బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లో కలుసుకున్న సహోద్యోగులు.. రోడ్డు మీదే వారిద్దరూ ఏం చేశారంటే..
ABN , Publish Date - Mar 22 , 2024 | 06:53 PM
ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు కొలువు దీరిన బెంగళూరులో ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదు. కొద్ది దూరం వెళ్లాలన్నా గంటలు గంటలు వెయిట్ చేయాల్సిందే.
బెంగళూరు (Bengaluru) భారత టెక్ రాజధాని. అలాగే స్టార్టప్‌లకు కూడా కేంద్ర బిందువు. కొత్త ఆలోచనలతో ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే ఎక్కువగా బెంగళూరునే ఎంచుకుంటారు. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు కొలువు దీరిన బెంగళూరులో ట్రాఫిక్ జామ్ (Bengaluru traffic) మామూలుగా ఉండదు. కొద్ది దూరం వెళ్లాలన్నా గంటలు గంటలు వెయిట్ చేయాల్సిందే. సాల్ట్ & లెట్స్ ట్రాన్స్‌పోర్ట్ (Salt & Let's Transport) అనే స్టార్టప్‌ను ప్రారంభించిన కో-ఫౌండర్ అంకిత్ పరాషర్ తాజాగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు (Viral).
కారులో ఆఫీస్‌కు వెళుతున్న అంకిత్ రెడ్ సిగ్నల్ పడడంతో రోడ్డుపై చాలా సేపు ఆగిపోయారు. అదే కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి శ్రీవాస్తవ బైక్ మీద ఆఫీస్‌కు వెళుతూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాడు. అనుకోకుండా అంకిత్ కారు పక్కనే శ్రీవాస్తవ బైక్ ఆపాడు. ఎంత సేపటికీ ట్రాఫిక్ కదలకపోవడంతో ఆ ఇద్దరూ రోడ్డు మీదే ఆఫీస్ పని ప్రారంభించారు. సదరు సంస్థ త్వరలో ప్రారంభించబోతున్న వెంచర్ గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. ఆ ఫొటోను అంకిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Viral Video: ``మ్యాచ్ ది ఫాలోయింగ్``లో ఆరేళ్ల బాలిక పొరపాటు.. దిగ్గజ ఆటగాడి రిప్లై ఏంటో తెలిస్తే..!
``బెంగళూరుకు రాక ముందు నేను ఇక్కడి ట్రాఫిక్ గురించి, స్టార్టప్‌ల గురించి ఎక్కువగా వింటూ ఉండేవాడిని. ఈ రోజు ఆ రెండూ కలిసిపోయాయి. శ్రీవాస్తవ, నేను ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆఫీస్‌కు లేట్ అయ్యాము. అయినా ఆ సమయాన్ని మేం సద్వినియోగం చేసుకున్నాం`` అని అంకిత్ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు ట్రాఫిక్ గురించి నెటిజన్లు కామెంట్లు చేశారు.