Jokes: ఐదేళ్లు కోమాలో ఉన్న మహిళ.. తల్లి చెప్పిన ఒకే ఒక్క జోక్‌తో ఎలా స్పృహలోకి వచ్చిందంటే..
ABN , Publish Date - Feb 06 , 2024 | 05:41 PM
‘‘సంతోషం సగం బలం.. హాయిగ నవ్వమ్మా..!’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. నవ్వు ఓ దివ్య ఔషధంలా పని చేస్తుందన్నది అక్షర సత్యం. నిత్యం నవ్వుతూ ఉంటే మాససిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. అయితే ...
‘‘సంతోషం సగం బలం.. హాయిగ నవ్వమ్మా..!’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. నవ్వు ఓ దివ్య ఔషధంలా పని చేస్తుందన్నది అక్షర సత్యం. నిత్యం నవ్వుతూ ఉంటే మాససిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇదే నవ్వు కారణంగా ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడిన రోగులను కూడా చాలా చూశాం. తాజాగా, ఇలాంటి అరుదైన ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్లు కోమాలో ఉన్న మహిళ.. తన తల్లి చెప్పిన జోక్‌తో స్పృహలోకి వచ్చింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. యూఎస్‌లోని (US) మిచిగాన్ నైల్స్ ప్రాంతానికి చెందిన జెన్నిఫర్ ఫ్లెవెల్లెన్ అనే మహిళ జీవితంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఈమె 2017లో కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె (woman went into coma) తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆమెను కోమా నుంచి తిరిగి బయటికి తీసుకొచ్చేందుకు వైద్యులు ఎంతో శ్రమించినా ఫలితం లేదు. దీంతో చేసేదేమీ లేక అంతా ఆమె ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురుచూడసాగారు. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో 2022లో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.
ఆమె 60 ఏళ్ల తల్లి ఓ రోజు కూతురు వద్ద ఉన్న సమయంలో పక్కన ఉన్న వారితో ఏవేవో జోకులు వేస్తూ ఉంది. ఆ సమయంలో వాటిలో ఓ జోక్ (Joke) చెవినపడగానే.. కోమాలో ఉన్న కూతురిలో చలనం వచ్చింది. దీంతో అంతా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పరీక్షించిన వైద్యులు కూడా షాక్ అయ్యారు. వైద్య చరిత్రలోనే ఇలాంటి ఘటనలు చాలా అరుదని తెలిపారు. స్పృమలోకి వచ్చిన మహిళ క్రమంగా కోలుకుంది. చివరకు 2023లో తన కుమారుడు ఆడుతున్న ఫుట్‌బాల్ ఆటను చూసేందూకూ హాజరైంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ‘‘ఇంతకీ ఆ తల్లి చెప్పిన జోక్ ఏంటీ’’.. అంటూ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై అంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరే! ఇది నిజంగా మిరాకిల్’’.. అంటూ కొందరు, ‘‘సంతోషం సగం బలం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇంతకీ ఆ జోక్ ఏంటో చెప్పండి ప్లీజ్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..