Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!
ABN , Publish Date - Nov 28 , 2024 | 06:36 PM
భరతనాణ్యం చేస్తున్న ఇద్దరు యువతుల వెనకున్న ఏనుగు లయబద్ధంగా కదులుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, తీవ్ర ఒత్తిడిలో పడ్డ ఏనుగు ఇలా చేస్తోందని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ వివరణ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు యువతుల భరతనాణ్యటం.. వారి వెనకే నిలబడి లయబద్ధంగా కదిలిన ఏనుగు! ఇదేమీ మూవీలో సీన్ కాదు.. గ్రాఫిక్స్‌తో సృష్టించిన మాయాజాలం కాదు.. ఓ యాదార్థ ఘటన. అందుకే.. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇక ఏనుగు స్టెప్పులు చూసిన జనాలు మురిసిపోయారు. అది లయబద్ధంగా తల కదుపుతుండటంతో యువతులతో కలిసి ఏనుగూ చిందేస్తోందని అన్నారు. ఈ అభిప్రాయం వేగంగా వ్యాపించడంతో వీడియోకు కుప్పలు తెప్పలుగా వ్యూస్ వచ్చాయి. అందరూ ఇదే నిజమని భావిస్తుండటంతో ఓ ఐఎఫ్ఎస్ అధికారి స్వయంగా రంగంలోకి దిగి జరిగిందేంటో చెప్పాల్సి వచ్చింది (Viral)..
Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..
యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట కాలు పెట్టింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, యువతులు నాణ్యం ప్రారంభించగానే ఏనుగు కూడా స్టెప్పులేయడం మొదలెట్టింది. వారి నాణ్యానికి అనుగూణంగా కాలు కదపడటం ప్రారంభించింది. ఇది చూడగానే జనాలు ఆశ్చర్యపోయారు. యువతుల నాణ్య ప్రతిభ ఏనుగుకూ అర్థమైందని అన్నారు. వారికి తోడుగా తనూ కాలుకదుపుతూ డ్యాన్స్ చేస్తోందని వందల కొద్దీ కామెంట్స్ కురిపించారు. ఫలితంగా ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూ్స్ వచ్చిపడుతున్నాయి.
Viral: ఇదేం ఐడియారా బాబూ! రోడ్డుపై గాల్లో తేలుతున్నట్టు ఇల్లు కడుతున్నారుగా!
వీడియోలో ఇలా ట్రెండింగ్‌లో కొనసాగుతుండటంతో దీనిపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ దృష్టి పడింది. అటవీ శాఖ అధికారిగా అపార అనుభవం ఉన్న ఆయన ఈ వీడియోపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనుగు సంతోషంతో స్టెప్పేస్తోందని భావించవద్దని హెచ్చరించారు. అది తీవ్ర ఒత్తిడిలో ఉండొచ్చని వివరించారు. ‘‘ఆ ఏనుగు ఒత్తిడిలో ఉంది. ఆ కదలికలు నాణ్యానికి సంకేతం కాదు.. ఒత్తిడికి చిహ్నం. జంతువుల చర్యలను మనుషులు తమ కోణంలోంచి విశ్లేషించకూడదు’’ అని చెప్పారు. దీనిపై స్పందించిన అనేక మంది ఏనుగు పరిస్థితి చూసి కరిగిపోయారు. గుండె ద్రవించిపోతోందంటూ కామెంట్ చేశారు.
Viral: పెళ్లి వేదిక మీదే వరుడితో వధువు తెగదెంపులు! కారణం తెలిస్తే..
ఒత్తిడితో ఉన్న జంతువులు ఇలా కదలడాన్ని స్టీరియోటిపిక్ బిహేవియర్ అని అంటారు. బందీలుగా ఉన్న ఏనుగులు అనేక సందర్భాల్లో ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గోలుసులతో కట్టి చిన్న చిన్న బోనుల్లో బందీలుగా ఏనుగులను ఉంచితే అవి ఒత్తిడికి లోనవుతాయి. తమ సహజ ఆవాసాలను దూరంగా మానవ నిర్మాణాల మధ్య ఉన్నప్పుడు కొత్త ప్రదేశాలు, పరిసరాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇలాంటప్పుడు ఏనుగు తామున్న చోటే వలయాకారంలో తిరగడం, తల ఊపడం లేదా పదే పదే అవయవాలను ఊపడం వంటివి చేస్తుంటాయట. కాబట్టి, అడవి జంతువులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..