Viral Video: హవ్వ.. మెట్రోలో ఇదేం పని.. టవల్స్ కట్టుకుని మెట్రలో హల్‌చల్ చేసిన యువతులు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Dec 02 , 2024 | 09:42 AM
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది విచిత్రమైన పనులు చేస్తున్నారు. అబ్బాయిలు ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు. అమ్మాయిలు బహిరంగా ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకోసం చాలా మంది ఎక్కువగా మహా నగరాల్లోని మెట్రో రైళ్లను ఎంచుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాగోలా పాపులారిటీ పెంచుకోవాలనే కోరిక చాలా మందిలో పెరుగుతోంది. అందుకోసం చాలా మంది విచిత్రమైన పనులు చేస్తున్నారు. అబ్బాయిలు ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు. అమ్మాయిలు (Girls) బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకోసం చాలా మంది ఎక్కువగా మహా నగరాల్లోని మెట్రో రైళ్లను (Metro Train) ఎంచుకుంటున్నారు. ఈ జాడ్యం మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా తీవ్రంగానే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే (Viral Video).
mimisskate అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. నలుగురు యువతులు కేవలం తెల్లటి టవల్స్ (Towels) మాత్రమే చుట్టుకుని మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించారు. సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఆ నలుగురు మెట్రో రైలు ఎక్కి వివిధ భంగిమలలో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. వారి చర్యలు చూసి మెట్రోలో ఉన్న ప్రయాణికులు కంగారు పడ్డారు. కొంతమంది వారిని వింతగా చూశారు. మరికొందరు వారితో కలిసి సెల్ఫీ దిగేందుకు పోటీలు పడ్డారు. మరికొందరు వారిని ఫొటోలు తీశారు. మరో స్టేషన్ రాగానే ఆ నలుగురు కిందకు దిగిపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది పబ్లిసిటీ స్టంట్``, ``ఇలాంటి వారిని న్యూసెన్స్ కేస్ పెట్టి అరెస్ట్ చేయాలి``, ``వృద్ధుడు కూడా వారి చర్యలను ఆసక్తిగా చూస్తున్నాడు``, ``వెరీ హాట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: యూపీ నుంచి బీహార్‌కు.. లారీ బానెట్ తెరిచి చూసిన కార్మికులకు దిమ్మదిరిగే షాక్..
Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..
Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి