Share News

IIT JEE: రోజుకు 17 గంటలు చదువుతున్న ఐఐటీ జేఈఈ విద్యార్థి! అతడిపై ఓ ఐఐటీ టాపర్‌ కామెంట్స్‌కు నెట్టింట ఆగ్రహం!

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:58 PM

ఐఐటీ సీటు కోసం రోజుకు 17 గంటలు చదువుతున్న విద్యార్థిపై ఐఐటీ టాపర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

IIT JEE: రోజుకు 17 గంటలు చదువుతున్న ఐఐటీ జేఈఈ విద్యార్థి! అతడిపై ఓ ఐఐటీ టాపర్‌ కామెంట్స్‌కు నెట్టింట ఆగ్రహం!

ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీలో సీటు కొట్టేందుకు ఇటీవల ఓ విద్యార్థికి రోజుకు 17 గంటలు చదువుతున్న ఉదంతం (Rigorous Schedule) నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. విద్యార్థి ఫాలో అవుతున్న షెడ్యూల్‌ను అతడి స్నేహితుడు నెట్టింట పోస్ట్ చేయడంతో విషయం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. కాగా, దీనిపై తాజాగా ఐఐటీ టాపర్ స్పందన కాస్తంత వివాదస్పదం అవుతోంది.

Viral: ఆ ఏనుగు పూర్తిగా కోలుకోవడంతో ఐఎఫ్ఎస్ అధికారి సంబరం!

2017లో ఐఐటీలో టాపర్‌గా నిలిచిన కల్పిత్ వీర్వాల్ ఈ షెడ్యూల్‌పై స్పందించాడు. తనకు అప్పట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వచ్చిందని, అయినా ఆ విద్యార్థి చదువుతున్న దాంట్లో సగం సమయం కూడా చదవలేదని చెప్పాడు. చదువుకు ఎంత కేటాయించాలనేది వారి వారి నైపుణ్యాల బట్టి కూడా ఉంటుందని వ్యాఖ్యానించాడు (IIT JEE Topper comments on aspirants Rigorous Schedule Sparks debate).

Break A Lock: వామ్మో..ఇదేం మ్యాజిక్‌ రా బాబూ.. తాళంపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే..


దీంతో, అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అహంకారం పనికిరాదంటూ అనేక మంది హితవు పలికారు. ‘‘నీకు ఆల్ ఇండియా ర్యాంకు వచ్చినంత మాత్రాన మరొకరి కష్టాన్ని తక్కువ చేసి చూపే హక్కు లేదు’’ అని అన్నారు. ‘‘ఇంతటి కఠిన షెడ్యూల్‌తో ప్రతికూల ఫలితాలు ఉన్నా ఎవరికి తోచిన విధానంలో వారు చదువుతారని, మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు’’ అని మరికొందరు వ్యాఖ్యానించారు.

Diesel Bikes: ప్రపంచంలో డీజిల్ బైకులు ఎందుకు లేవో తెలుసా?

కాగా, రాజస్థాన్‌కు చెందిన వీర్వాల్.. రాష్ట్రం నుంచి జేఈఈ మెయిన్స్‌లో ఫుల్ మార్క్స్ సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2017 నాటి ఎంట్రన్స్‌లో 360/360 మార్కులు సాధించాడు. ఫలితంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. అంతకుముందు, అతడు ఇండియన్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్, నేషనల్ టేలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌లో కూడా టాపర్‌గా నిలిచాడు. తాను రోజుకు 17 గంటలు చదవలేదని, కోటాలో ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, అయితే, నిరంతరంగా చదవడంతో అనుకున్న ఫలితం దక్కిందని అప్పట్లో మీడియాకు చెప్పాడు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 06:05 PM