Share News

Theft Viral Video: అనుకున్నది సాధించాడుగా.. దుకాణంలో ఈ తాత టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Apr 05 , 2025 | 09:29 AM

ఒంటిపై టవల్ కప్పుకున్న ఓ వృద్ధుడు.. దుకాణంలో ఏదో కొనేందుకు వెళ్తాడు. అయితే దుకాణం ఎంట్రెన్స్‌లోనే టేబుల్‌పై విరాళాలు వేసే బాక్స్‌ను ఏర్పాటు చేసి ఉంటారు. అందులో అప్పటికే కొంత మొత్తం కూడా ఉంటుంది. అయితే చివరకు ఈ తాత చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Theft Viral Video: అనుకున్నది సాధించాడుగా.. దుకాణంలో ఈ తాత టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

చోరీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు దొంగలు చోరీ చేయడం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. మరికొందరు కళ్లెదుటే ఉండి కూడా కళ్లగప్పి నగలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒంటిపై టవల్ కప్పుకొని వచ్చిన ఓ తాత.. చివరకు ఎలా చోరీ చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఒంటిపై టవల్ కప్పుకున్న ఓ వృద్ధుడు.. దుకాణంలో ఏదో కొనేందుకు వెళ్తాడు. అయితే దుకాణం ఎంట్రెన్స్‌లోనే టేబుల్‌పై విరాళాలు వేసే బాక్స్‌ను ఏర్పాటు చేసి ఉంటారు. అందులో అప్పటికే కొంత మొత్తం కూడా ఉంటుంది.

Firing Viral Video: గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా.. ఎలా ఫైర్ చేశాడో చూస్తే షాకవ్వాల్సిందే..


దుకాణం లోపలికి వెళ్లిన ఆ వృద్ధుడు.. అక్కడే ఉన్న విరాళాల పెట్టెపై కన్నేస్తాడు. ఒకసారి చుట్టూ చూసి చివరకు మెల్లిగా దగ్గరికి జరుపుకొంటాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా దానిపై చేయి వేసి, టవల్ కిందకు జరుపుతాడు. ఆ తర్వాత పెట్టెను టవల్ కింద పెట్టుకుని (Old man steals donation box) మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాడు.

Funny Viral Video: ఇంటి ముందు సీసీ కెమెరా.. దగ్గరికి వెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..


విరాళాల పెట్టె కనిపించకపోయే సరికి మొత్తం వెతికిన దుకాణ యజమాని.. చివరగా సీసీ ఫుటేజీ పరిశీలిస్తాడు. వృద్ధుడు తెలివిగా చేసిన పని చూసి చివరకు అవాక్కవుతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తాత తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘విరాళాలు ఎక్కడికి చేరాలో.. అక్కడికే చేరాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా లైక్‌లు, 1 మిలియన్‌‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral Video: పెళ్లికి వచ్చి ఇదేం పని.. బంధువుల నిర్వాకానికి అవాక్కైన వరుడు..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 10:40 AM