Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:14 AM
పైకి అందంగా కనిపిస్తున్న ఓ చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తికి... నీళ్లను చూడగానే అనుమానం కలిగింది. దీంతో అదేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. ఓ పెద్ద రాయి తీసుకుని అందులో వేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

అసలే ఇది ఎండాకాలం. ఎండ వేడికి తట్టుకోలేక ఎంతో మంది ఈత ఆడేందుకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, డ్యామ్‌లు.. ఇలా ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ ఈత కొడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో తొందరపాటు వల్ల కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చూసేందుకు నీళ్లలా ఉన్నా అందులో రాయి వేసి చూడగా చివరకు షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా ఉలిక్కిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పైకి అందంగా కనిపిస్తున్న ఓ చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తికి... నీళ్లను చూడగానే అనుమానం కలిగింది. పైకి నీళ్లలా కనిపిస్తున్నా కూడా అందులో ఏదో ఉన్నట్లు అనుమానం కలిగింది. దీంతో అదేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. ఓ పెద్ద రాయి తీసుకుని అందులో వేశాడు.
Funny Viral Video: ఇంటి ముందు సీసీ కెమెరా.. దగ్గరికి వెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..
రాయి నీళ్లలో పడగానే.. లోపలి నుంచి ఓ పెద్ద మొసలి అమాంతం పైకి లేచి నోరు తెరిచింది. అప్పటికదాకా నీళ్లే కదా అని అనుకున్న వ్యక్తి.. చివరకు మొసలిని చూసి షాక్ అయ్యాడు. నీళ్లే కదా అని పొరపాటున అందులోకి దిగి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రమాదం ఏ రూపంలో పొంచి (Crocodile hiding in the water) ఉంటుందో ఎవరూ చెప్పలేరు.. అనేందుకు నిదర్శనంగా ఉన్న ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
Marriage Viral Video: పెళ్లికి వచ్చి ఇదేం పని.. బంధువుల నిర్వాకానికి అవాక్కైన వరుడు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. కంటికి కనిపించేదంతా నిజం కాదంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ మొసలి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Theft Viral Video: అనుకున్నది సాధించాడుగా.. దుకాణంలో ఈ తాత టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..