Share News

Viral video: మైక్రోవేవ్‌ను ఇలా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. బామ్మా... నువ్వు కేక..!

ABN , Publish Date - Jun 07 , 2024 | 07:13 PM

తెలిసి కొందరు, తెలీక మరికొందరు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో చాలా మంది వినూత్న ప్రయోగాలన్నీ చేస్తూ..

Viral video: మైక్రోవేవ్‌ను ఇలా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. బామ్మా... నువ్వు కేక..!

తెలిసి కొందరు, తెలీక మరికొందరు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో చాలా మంది వినూత్న ప్రయోగాలన్నీ చేస్తూ.. ఆ వీడియోలను నెట్టింట్లోకి వదులుతుంటారు. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఓ వృద్ధురాలి వీడియో తెగ వైరల్ అవుతోంది. మైక్రోవేవ్‌ను బామ్మ వాడిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బామ్మా..! నువ్వు కేక..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ బామ్మ (old woman) తెలిసి చేసిందో.. లేక తెలీక చేసిందో తెలీదు గానీ.. మైక్రోవేవ్‌ను అందరిలా కాకుండా విరుద్ధంగా ఉపయోగించింది. సాధారణంగా కొందరు తమ ఇళ్ల ముందు లెటర్స్ వేసేందుకు వీలుగా పోస్ట్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం. ఈ బామ్మకూ తన ఇంటి ముందు పోస్ట్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలని అనిపించింది.

Viral video: డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను తలదన్నే సీన్.. ఈ అత్తాకోడళ్ల గొడవ మామూలుగా లేదుగా..


అయితే ఇందుకోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెప్పించుకుండా.. ఇంట్లోని వస్తువులనే వాడుకోవాలని అనుకుంది. చివరకు ఇంట్లోని మైక్రోవేవ్‌ను (Microwave) చూడగానే.. బామ్మకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చందే తడవుగా.. ఇంట్లోని మైక్రోవేవ్‌ను తీసుకొచ్చి, తన ఇంటి బయట పెరట్లో ఏర్పాటు చేసింది. రోజూ ఇంట్లోకి వచ్చి, వెళ్లే ముందు మైక్రోవేవ్ బటన్ ప్రెస్ చేసి, లోపల ఏమైనా లెటర్స్ ఉన్నాయో, లేదో పరిశీలించుకుంటోంది.

Viral video: హీరోలు కూడా చేయలేని స్టంట్స్.. చావుతో చెలగాటం అంటే ఇదేనేమో..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బామ్మ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మైక్రోవేవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: అసభ్యకరంగా డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిని వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

Updated Date - Jun 07 , 2024 | 07:13 PM