Personality Test: మీ బ్యాగు తగిలించుకొన్న తీరే.. మీరేమిటో చెబుతోంది
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:33 PM
Personality Test: మీ భూజానికి తగిలించుకొన్న బ్యాగ్.. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని తెలుసా? భూజానికి, వీపు భాగానికి, క్రాస్‌గా బ్యాగ్ తగిలించుకొంటే.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే అంశంపై సైకాలజీస్టులు ఈ విధంగా వెల్లడిస్తున్నారు.
గతంలో ఏదైన పని మీద ఎవరైనా బయటకు వెళ్తుంటే.. సూట్ కేసు లేదా చేతి సంచి తీసుకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు బ్యాగ్‌తో వెళ్తున్నారు. ఇలా బ్యాగ్‌తో సులువుగా ప్రయాణం చేస్తున్నారు. మీరు.. మీ బ్యాగ్‌ని ఇలా తీసుకువెళ్లడం ద్వారా అందులో మీ వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తుందన్న సంగతి మీకు తెలుసా? క్రాస్‌బాడీ, బ్యాక్ ప్యాక్, షోల్డర్ బ్యాగ్‌ల వరకు, మీ బ్యాగ్‌ని.. మీరు ఎలా తీసుకెళ్లాలి అనేది కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా.. అది మీ భావోద్వేగ అలంకరణ, ప్రవర్తనా విధానంతోపాటు ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబిస్తోంది.
ప్రతి రోజు.. మన దైనందిన అలవాట్లు, రోజు వారీ వస్తువులను ఎలా తీసుకు వెళ్తామనే దానితోపాటు మనలోని మనస్తత్వాన్ని సైతం తెలియజేస్తాయని సైకాలజిస్టులు గాఢంగా విశ్వసిస్తున్నారు. బ్యాగ్ వెనక తగిలించుకొంటే.. సాహసోపేతంగా వ్యవహరిస్తారా అని... బ్యాగ్ క్రాస్‌గా వేసుకొంటే.. ప్రాక్టికాలిటీగా ఉంటారా? అంటే .. మీరు బ్యాగ్ ధరించే విధానాన్ని బట్టి.. మీలోని బలాలు, ధోరణులతోపాటు జీవితంపై దృక్పథాన్ని గురించి వారి ఇలా చెబుతున్నారు.
మీ వ్యక్తిత్వం గురించి మీరు మీ బ్యాగ్‌ని తీసుకెళ్లే విధానం ఏమిటంటే?
1) క్రాస్ బాడీ వ్యక్తిత్వ లక్షణం..
మీరు మీ బ్యాగ్‌ని క్రాస్‌బాడీ స్టైల్‌లో తీసుకువెళితే.. మీ వ్యక్తిత్వం దృఢంగా ఉంటుంది. పటిష్టమైన భద్రతతో ఉంటారు. అలాగే ప్రాక్టికల్‌గా ఉంటారని స్పష్టమం చేస్తున్నారు. జీవితంలో అన్ని అంశాలను ఓ క్రమబద్ధంగా నిర్వహించడానికి వీరు ఇష్టపడతారు. అదే విధంగా స్వతంత్రంగా, స్వయం సమృద్ధి సాధించడంతోపాటు అప్పగించిన పనులను సమర్ధవంతంగా పూర్తి చేయడంపై దృష్టి సారిస్తారు. ఇక ఈ బ్యాగ్ ఇలా తీసుకు వెళ్లే వారి శైలి.. జీవితానికి ఒక పద్దతితోపాటు మీ పరిసరాలపై నియంత్రణలో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా బ్యాగ్ తీసుకు వెళ్లే వారు.. అకౌంటెంట్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఈవెంట్ ప్లానర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, ఆపరేషన్స్ మేనేజర్, రీసెర్చ్ సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అర్బన్ ప్లానర్ వంటి వారు ఈ కోవలోకి వస్తారు.
2 ) బ్యాగ్ వెనుకకు తగిలించుకొంటే..
మీరు.. మీ బ్యాగ్‌ని వెనుకకు తగిలించుకొంటే.. మీరు సాహసోపేతంగా ఉంటారు. అలాగే సంపద కలిగి ఉంటారు. వివిధ పరిస్థితుల్లో సైతం.. అంటే విపత్కర పరిస్థితుల్లో కూడా అభివృద్ధి దిశగా పయనం సాగిస్తారు. ఈ శైలిలో బ్యాగ్ తగిలించుకున్న వారు.. కార్యాచరణపై దృష్టిని పెట్టడమే కాకుండా.. మారుతోన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని చాటుకొంటారు. ముందు చూపుతో ఆలోచించడమే కాకుండా.. సవాళ్లను సైతం ఎదుర్కొవడానికి వీరు ఇష్టపడతారు. భవిష్యత్తు కోసం వ్యూహా రచన చేస్తూ.. ప్రణాళికలు సిద్దం చేసుకొంటారు. అన్వేషణతోపాటు కొత్త అనుభవాల సాధన చేయడాన్ని మీ వ్యక్తిత్వం సూచిస్తుంది.
బ్యాగ్‌లు ఇలా తగిలించుకోవడం వల్ల.. ట్రావెల్ బ్లాగింగ్, అడ్వెంచర్ టూరిజం, అవుట్‌డోర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్, ఆర్కియాలజీ ఈవెంట్ ప్లానింగ్, మిలిటరీ స్ట్రాటజీ, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ వంటి వారు ఈ కోవలోకి వస్తారు.
3) భుజంపై తగిలించుకొంటే..
మీ బ్యాగ్‌ని మీ భుజానికి తగిలించుకొంటే... మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే మీ దయనందిన జీవితంలో.. సుఖ: శాంతులకు విలువిస్తారు. మీరు ఒక లక్ష్యాన్ని నమ్ముకొని.. దాని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తారు. ఇక మరొకరనిపై ఆధార పడిన వారుగా ఉంటారు, మీరు.. మీ బ్యాగును తీసుకు వెళ్లే తీరు.. సౌలభ్యంతోపాటు అవగాహన విధానాన్ని ప్రతిబింబిస్తుంది, అన్నింటికీ మించి బాధ్యతతోపాటు ఆచరణాత్మకతకు విలువనిచ్చే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. థెరపిస్ట్, టీచర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, ప్రాజెక్ట్ మేనేజర్, కౌన్సెలర్, ఇంజనీర్, డేటా అనలిస్ట్, సోషల్ వర్కర్, హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్ తదితరులు ఈ కోవలోకి వస్తారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి