Share News

Mohammed Siraj: సిరాజ్‌పై విషం చిమ్మిన ఆసీస్.. మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

ABN , Publish Date - Dec 08 , 2024 | 08:17 PM

Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆస్ట్రేలియా టార్గెట్ చేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో అతడిపై విషం చిమ్మింది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Mohammed Siraj: సిరాజ్‌పై విషం చిమ్మిన ఆసీస్.. మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

IND vs AUS: ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే తోపు ప్లేయర్లు కూడా భయపడతారు. దీనికి కారణం ఒకటి కంగారూ ఆటగాళ్లైతే.. మరొకటి అక్కడి ఆడియెన్స్. గ్రౌండ్‌లోకి దిగింది మొదలు ప్రత్యర్థి క్రికెటర్లను టార్గెట్ చేసుకొని దూషణలకు దిగడం, వారితో గొడవ పెట్టుకోవడం, స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ టీమ్‌కు అలవాటు. ఆ దేశ అభిమానుల్లో చాలా మంది ఇదే కేటగిరీలోకి వస్తారు. అపోజిషన్ టీమ్ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని హేళన చేయడం వారికి ఆనవాయితీగా మారింది. దాన్నే భారత సిరీస్‌లోనూ కంటిన్యూ చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్లపై విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ సిరాజ్‌ను టార్గెట్ చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


గాలి తీసేశాడు

సిరాజ్ మియాపై విషం చిమ్మారు ఆస్ట్రేలియా ప్రేక్షకులు. బౌండరీ లైన్ దగ్గరకు ఫీల్డింగ్‌కు వచ్చిన మియాను ఎగతాళి చేశారు అక్కడి ఫ్యాన్స్. కంగారూ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను భారత పేసర్ ఔట్ చేయడంతో అక్కడి అభిమానులు తట్టుకోలేకపోయారు. సిరాజ్ మళ్లీ ఫీల్డింగ్‌కు రాగానే అతడ్ని లక్ష్యంగా చేసుకున్నారు. బూ.. అంటూ హేళన చేశారు. ఇలాంటి స్లెడ్జింగ్‌లు కెరీర్‌లో ఎన్నో చూసిన సిరాజ్.. అరవండి అంటూ వాళ్లను మరింత రెచ్చగొట్టాడు. చూస్కుందాం అంటూ వాళ్ల గాలి తీసేశాడు. ఇది అడిలైడ్ టెస్ట్ రెండో రోజు చోటుచేసుకుంది. అయితే వీడియో లేట్‌గా బయటకు వచ్చింది.


తట్టుకోలేక..

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ ఫైట్‌కు దిగిన సంగతి తెలిసిందే. సెంచరీతో విరుచుకుపడిన హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు మియా. అతడు క్రీజును వదిలేసి వెళ్తూ పేస్ గన్‌ను తిట్టాడు. దీంతో సీరియస్ అయిన సిరాజ్ కూడా అతడికి కౌంటర్ ఇచ్చాడు. హెడ్ మళ్లీ ఏదో అనడానికి ప్రయత్నించగా.. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఫైర్ అయ్యాడు. ఆ ఓవర్ ముగిశాక అతడు బౌండరీ లైన్ దగ్గరకు రాగానే ఆసీస్ ఫ్యాన్స్ అతడ్ని ఎగతాళి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. సిరాజ్‌ను ఎంత రెచ్చగొడితే అంతగా ఇచ్చిపడేస్తాడని అంటున్నారు. ఈ ఘటన జరిగాక అతడు మరో 2 వికెట్లు తీశాడని గుర్తుచేస్తున్నారు. మియాతో మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు. బ్రిస్బేన్ టెస్ట్‌లో కంగారూలకు మరింత ఇచ్చిపడేయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

సెంచరీ, హ్యాట్రిక్, 10 వికెట్లు.. బచ్చా ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

డేంజర్‌లో రోహిత్-కోహ్లీ.. రిటైర్మెంట్ తప్పించుకోవాలంటే ఒకటే దారి

ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్

For More Sports And Telugu News

Updated Date - Dec 08 , 2024 | 08:20 PM