Share News

IND vs NZ: కివీస్ చేతిలో క్లీన్‌బౌల్డ్.. క్రీజ్ లోనే కుప్పకూలిన కోహ్లీ

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:42 AM

విరాట్ ను ఊరిస్తూ కివీస్ స్పిన్నర్ వేసిన ఫుల్ టాస్ బంతి స్టంప్స్ ను తాకింది. ఊహించని పరిణామానికి కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ వైరలవుతోంది.

IND vs NZ: కివీస్ చేతిలో క్లీన్‌బౌల్డ్.. క్రీజ్ లోనే కుప్పకూలిన కోహ్లీ

పూణె: కివీస్ తో రెండో మ్యాచ్ లో టీమిండియా ఎక్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ విసిరిన ఫుల్ టాస్ ను సరిగా అంచనా వేయలేక బంతిని హిట్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. కివీస్ తో టెస్టు సిరీస్ లో పేలవమైన ప్రదర్శన చేసిన కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేయడంతో.. భారత జట్టు ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది.


పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఉదయం 30 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ కావడంతో కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్‌లో తన 9వ బంతిని ఆడిన కోహ్లి బంతి డైరెక్షన్ ను తప్పుగా అంచనా వేశాడు. బెంగళూరులో కివీస్‌తో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లి.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ మరోసారి బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు.


16/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టు గంట వ్యవధిలోనే 66/3తో ఒత్తిడిలో పడిపోయింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైశ్వాల్ (28), రిషబ్ పంత్ (7) ఉండగా.. విరాట్ కోహ్లీ (1), శుభమన్ గిల్ (30) ఈరోజు పెవిలియన్‌‌కి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రమే రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 25 , 2024 | 11:43 AM